ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-ఆఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగి చివరకు టై గా ముగిసింది. కాగా ఈ మ్యాచ్ లో సారధ్యబాధ్యతలను అందుకున్న ‘మిస్టర్ కూల్’ ధోనీ.. మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించారు. కాగా, టీమిండియా బౌలర్లను అప్ఘన్ బ్యాట్స్ మెన్ చీల్చిచండాడుతున్న క్రమంలో ఓ ఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ధోని అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవాల్సి వచ్చింది.
కుల్దీప్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్ లో మార్పులు చేయాలంటూ ధోనీపై ఒత్తిడి తెచ్చాడు. బౌలింగ్ మీద శ్రద్ధ పెట్టకుండా పదే పదే ఫీల్డింగ్ లో మార్పులు చేయాలంటూ అడుగుతుండటంతో ధోనీకి కోపం వచ్చింది. దీంతో మిస్టర్ కూల్ కాస్తా కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ‘బౌలింగ్ చేస్తావా లేకపోతే నీ స్థానంలో వేరొకర్ని మార్చాలా?’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుల్దీప్ మారు మాట్లాడకుండా బౌలింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరి వైరల్ అవుతోంది.
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకోవడంతో అనుకోకుండా ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. గతంలోనే ధోని వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఊరించి.. ఉత్కంఠకు తెరలేపి.. తుదకు టైగా ముగిసిన విషయం తెలిసిందే. టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటుతో చివర్లో అకట్టుకుని విజయం మనదే అని చెప్పినా.. మరో బంతితో మ్యాచ్ ముగుస్తుందన్న క్రమంలో ఔట్ కావడంతో టీమిండియాకు విజయం దూరమైంది.
"Bowling karega ya bowler change karein" MS Dhoni to Kuldeep Yadav pic.twitter.com/Sb7mKOporI
— Khurram Siddiquee (@iamkhurrum12) September 25, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more