రాజ్ కోట్ వేదికగా అతిధ్య జట్టు వెస్టిండీస్ తో ఇవాళ ప్రారంభమైన తొలిటెస్టులో మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ లోనే ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఎల్బీడబ్యూగా డకౌట్ అయ్యి వెనుదిరగడంతో.. జట్టులోకి వచ్చిన స్థానిక ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా అచితూచి అడుతూ.. మరోవైపు వేగంగా అడుతున్న పృధ్వీషాకు వెన్నుదన్నుగా నిలస్తూనే పరుగులను సాధిస్తూ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కూడా బ్యాటింగ్ వేగాన్ని పెంచిన పూజారా 130 బంతుల్లో 86 పరుగులు చేశాడు.
అయితే రాజ్ కోట్ లోకల్ బాయ్ కి సెంటిమెంట్లు ఎక్కువని అక్కడందరికీ తెలసిందే. ఈ ప్రస్తావన ఎందుకని అంటున్నారా.? పృథ్వీషాతో కలిసి రెండో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం అందించిన నయావాల్ బ్యాటింగ్ చేస్తుంటే కాసేపు అందరినీ ఒక సందేహం వేధించింది. అతడి ప్యాంటు ముందు జేబులో ఏదో ఉన్నట్టు కనిపించింది. అదేంటి అన్నదే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమైంది. అతడికి నమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిన వారు ఎవో ఊహాగానాలకు తెరతీసారు.
సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిచ్చే పూజారా ఏం పెట్టుకున్నాడో అని సందేహ పడ్డారు! ఐతే ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న రాజ్‌కోట్‌లో ఎండవేడిమి ఎక్కువ. అందుకే మ్యాచ్ మధ్యలో మంచినీటి కోసం రిజర్వు ఆటగాడిని ఎందుకు రప్పించాలి అనుకున్నాడో ఏమో ఒక చిన్న మంచినీటి సీసాను జేబులో దాచుకున్నాడు. దాహం వేసినప్పుడల్లా బయటకు తీసి గొంతు తడుపుకొన్నాడు. దీంతో పుజారా జేబులో ఉన్నది మంచి నీటిసీసానా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Beating Rajkot's heat, Pujara's way
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more