Prithvi Shaw Century In Debut Test Match అరంగ్రేట మ్యాచులోనే పృధ్వీ షా అద్భుతం..

Prithvi shaw youngest indian to crack hundred on debut

India vs West India, Paytm Test series, Prithvi Shaw, Virat Kohli, Rajkot Test, Day 1, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Debutant Opener Prithvi Shaw scored his maiden century in Test cricket as India went to Tea at 232 for the loss of three wickets.

అరంగ్రేట మ్యాచులోనే అద్భుతం.. రికార్డులు పృధ్వీ షా సొంతం..

Posted: 10/04/2018 04:48 PM IST
Prithvi shaw youngest indian to crack hundred on debut

వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్‌ పృథ్వీషా అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించాడు. ఓపెనర్‌గా క్రీజులో వచ్చిన పృథ్వీ.. కేవలం 99 బంతుల్లోనే 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు అర్ధశతకం పూర్తిచేసిన పుజారా (67 నాటౌట్‌) పృథ్వీకి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది.

రికార్డుల షా..

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన షా 18 ఏళ్లకే జాతీయ జట్టు తలుపులు తట్టాడు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టే అతడికి అరంగేట్ర మ్యాచ్‌. ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన అతడు వన్డే తరహాలో పరుగుల వరద పారించాడు. తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. తద్వారా గంగూలీ, సెహ్వాగ్‌ తదితర దిగ్గజాల సరసన చేరాడు. అంతేకాదు అతి పిన్న వయసులో టెస్టు శతకం సాధించిన 7వ క్రికెటర్ గా వృధ్వీషా ఘనత వహించాడు. అరంగేట్రంలోనే శతకం సాధించిన నాలుగో అతిపిన్న క్రికెటర్ గానూ పృధ్వీ షా  రికార్డు నెలకొల్పాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించిన పృథ్వీ షా అటు బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా మనన్నలు పోందిన సచిన టెండుల్కర్ కు కూడా అందని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటి అంటే... రంజీ, దులీప్‌ ట్రోఫీలతో పాటు టెస్టుల్లోనూ అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన పృద్వీ షా.. తన మాదిరిగానే రంజీ, దులీప్‌ ట్రోఫీల్లో తన తొలి మ్యాచుల్లోనే శతకం చేసినా సచిన్ ఘనతకు కూడా అందుకున్నాడు. కాగా టెస్టుల్లో శతకానికి సచిన్ 13 మ్యాచులు వేచిచూడాల్సి రాగా, షా మాత్రం తొలిటెస్టులోనే దానిని అందుకుని.. సచిన్ కు దక్కని రికార్డు అందుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : India vs West India  Paytm Test series  Prithvi Shaw  Virat Kohli  Rajkot Test  Day 1  sports  cricket  

Other Articles