Mithali Raj makes fifty as India seal semi-final spot టీ20ల్లో టాప్ ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న మిథాలీ

Mithali raj now has more t20i runs than virat kohli and rohit sharma

mithali raj, highest indian t20 runs, highest t20 runs scorer, rohit sharma, virat kohli, mithali raj t20 record, mithali raj cricket record, icc women world t20, cricket news, cricket, sports news, latest sports news, sports

The Indian team secured a place in the semi-finals of the Women’s World T20 with a 52-run win over Ireland, thanks in part, to a stellar effort by Mithali Raj.

టీ20ల్లో టాప్ ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న మిథాలీ

Posted: 11/16/2018 07:00 PM IST
Mithali raj now has more t20i runs than virat kohli and rohit sharma

టీ20ల్లో భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌ వుమెన్ మిథాలీ రాజ్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచిన మిథాలీ రాజ్.. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో అర్ధశతకం సాధించి అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. గయానా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (51: 56 బంతుల్లో 4x4, 1x6) హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ జట్టు టోర్నీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

ఐర్లాండ్‌పై 51 పరుగులు చేయడం ద్వారా టీ20 ఫార్మాట్లో మొత్తం 2,283 పరుగులతో మిథాలీ రాజ్ నెం.1 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. రోహిత్ శర్మ (2,207), విరాట్ కోహ్లి (2,102) భారత్ తరఫున వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఇప్పటి వరకు 80 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్ 80, విరాట్ కోహ్లీ 58 మ్యాచులు ఆడి 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..!

1. మిథాలీ రాజ్ 2,283 పరుగులు (80 ఇన్నింగ్స్‌ ల్లో)
2. రోహిత్ శర్మ 2,207 పరుగులు (80)
3. విరాట్ కోహ్లి 2,102 పరుగులు (58)
4. హర్మన్‌ప్రీత్ కౌర్ 1,827 పరుగులు (80)
5. సురేశ్ రైనా 1,605 పరుగులు (66)
6. మహేంద్రసింగ్ ధోని 1,487 పరుగులు (80)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mithali raj  highest t20 runs scorer  rohit sharma  virat kohli  cricket  

Other Articles