ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే భారత్ జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరిరోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది.
వాస్తవానికి పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్ స్టేడియం పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలిస్తుందంటూ ఆస్ట్రేలియా అతిగా ప్రచారం చేసింది. దీనికి తోడు పిచ్‌పై పచ్చిక ఉండటంతో.. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ అనుకూలం అని టీమిండియా భావించింది. కానీ.. తొలిరోజే ఆటగాళ్ల పాద ముద్రలతో పిచ్ గరుకుగా మారిపోయి.. అస్థిర బౌన్స్‌తో పాటు స్పిన్నర్లకి సహకారం లభించింది. పిచ్ స్పిన్నర్లకి కూడా అనుకూలించే అవకాశమున్నా.. రవీంద్ర జడేజాని పక్కన పెట్టడం భారత జట్టుని దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 8/106 గణాంకాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం గమనార్హం.
‘పెర్త్ పిచ్‌ని పరిశీలించిన తర్వాత.. నలుగురు ఫాస్ట్ బౌలర్లు టీమ్‌లో ఉంటే చాలు అనుకున్నా. రవీంద్ర జడేజాని తీసుకోవాలనే ఆలోచనే నాకు రాలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒక స్పిన్నర్‌ని తుది జట్టులో ఆప్షన్‌గా ఉంచుకోవాలనే ఆలోచనే నాకు లేకపోయింది. ఈనెల 26 నుంచి జరగనున్న మెల్బోర్న్ టెస్టులో తప్పిదాలను దిద్దుకుని కచ్చితంగా టీమ్‌ని గెలిపించే ప్రదర్శన చేస్తాను’ అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more