టెస్ట్ అరంగేట్రంలోనే మయాంక్ అగర్వాల్ 71 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టి తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తన ఖాతాలో రికార్డులు వేసుకున్నాడు. మెల్ బోర్న్ వేదికగా ఇవాళ ప్రారంభమైన మూడవ, బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓపెనర్ గా వచ్చిన మయాంక్.. తొలి ఇన్నింగ్స్‌లోనే 76 పరుగులు చేసి రాణించాడు. గత రెండు టెస్టుల్లో పరుగులు సాధించడానికి మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇబ్బంది పడగా.. మయాంక్ మాత్రం చాలా సులువుగా పరుగులు సాధించాడు.
ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్ మన్ లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌన్సర్లతో బెంబేలెత్తించినా బెదరకుండా క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా మయాంక్ నిలిచాడు. ఈ క్రమంలో ఎప్పుడో 71 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టడం విశేషం. 1947లో దత్తు ఫడ్కర్ సిడ్నీ టెస్ట్‌లో అరంగేట్రం చేసి 51 పరుగులు చేశాడు. ఇన్నాళ్లూ ఇవే అత్యధిక పరుగులుగా ఉన్నాయి.
మయాంక్ దెబ్బకు ఇప్పుడా దశాబ్దాల రికార్డు తెరమరుగైంది. 27 ఏళ్ల మయాంక్.. క్రీజులో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ముఖ్యంగా తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లయన్‌పై అతడు ఎదురు దాడికి దిగాడు. అతని బౌలింగ్‌లోనే ఓ సిక్స్ కూడా బాదాడు. లయన్ వేసిన మరో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో ఓపెనర్ విహారితో కలిసి తొలి వికెట్ కు 40 పరుగులు, పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మయాంక్‌కు మంచి రికార్డు ఉంది. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more