ఆస్ట్రేలియా గడ్డపై నిలకడగా ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సుమారుగా 16 ఏళ్ల నాటి రికార్డును తన పేరున తిరగరాసుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విరాట్ కోహ్లీ.. కొద్దిలో శతకాన్ని మిస్ అయినా.. తన ఖాతాలోకి మాత్రం మరో రికార్డును మాత్రం వేసుకున్నాడు. ఒక ఏడాదిలో విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.
2002లో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 1,137 పరుగులతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పగా.. తాజాగా విరాట్ కోహ్లీ 1,138 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అయితే.. ద్రవిడ్ అప్పట్లో కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. కోహ్లీ మాత్రం 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్‌ని చేరుకోవడం విశేషం. 2002లో విదేశీ గడ్డపై పరుగుల వరద పారించిన రాహుల్ ద్రవిడ్.. 66.88 సగటుతో ఏకంగా 4 శతకాలు, 4 అర్ధశతకాలతో మెరిశాడు. ఆ ఏడాది విదేశాల్లో 11 టెస్టులాడిన ద్రవిడ్ 18 ఇన్నింగ్స్‌ల్లో 1,137 పరుగులు చేశాడు.
మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో శతకాల మోత మోగించిన విరాట్ కోహ్లీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. గత వారం పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో శతకం సాధించిన కోహ్లీ.. తాజాగా మెల్‌బోర్న్‌లోనూ 82 పరుగులు చేయడం ద్వారా సిరీస్‌లో 259 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఇప్పటికే (టెస్టుల్లో) దక్షిణాఫ్రికా గడ్డపై 286, ఇంగ్లాండ్ గడ్డపై 593 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
That slow mate that can't keep up with you between wickets
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more