‘ఏ నిమిషానికి ఏమి జరుగునో!’ అన్న మాట క్రికెట్‌కి కచ్చితంగా సరిపోతుంది. నిజమే మరి మ్యాచ్‌లో బంతి బంతికీ కథ మారిపోతుంటుంది. ఇక క్రికెట్ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇలానే ఓ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. కానీ, వారు సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు వచ్చాయి. అదెలాగంటే..
ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా జుని జట్టుపై గెలవడానికి దేశాయ్‌కు 6 పరుగులు కావాల్సివచ్చింది. అయితే, ఒకే బంతి మిగిలి ఉండటంతో ఇటు అభిమానులకు, అటు ఆటగాళ్లకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీరా మొదటి బాల్ పడింది.. అది కాస్త వైడ్. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్! అలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
6 runs needed off 1 ball and the team scored it with 1 ball to spare
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more