న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగనుయ్ లో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. రెండో వన్డేలో ఉమన్స్ టీం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 88 బాల్స్ మిగిలి ఉండగానే విక్టరీ కొట్టడం విశేషం. 162 పరుగుల టార్గెట్‌ను 36 ఓవర్లలోనే చేరుకొని... సత్తా చాటింది మిథాలీ రాజ్ టీం. ఇదే స్టేడియంలో కోహ్లీ సేన మూడో వన్డేలో అద్భుత విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో వశం చేసుకోగా... వుమన్స్ టీం... మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు గెలిచి... 2-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
టాస్ గెలిచిన టీంఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. వరుసగా పెవిలియన్ దారి పట్టారు. 44.2 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన టీం ఇండియా మహిళా ఓపెనర్లలో స్మృతి మంధాన మరోసారి చెలరేగి ఆడింది. 83 బాల్స్‌లో 90 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచింది.
కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం 111 బాల్స్ ఆడి... 63 పరుగులు చేసి... నాటౌట్‌గా నిలిచింది. వీళ్లిద్దరూ విజృంభించి ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టి... 35.2 ఓవర్లకే విజయం టీంఇండియా వశమైంది. కోహ్లీ టీం లాగే... వుమన్స్ టీం కూడా చక్కటి విజయాలు సాధిస్తుండటంతో మహిళా జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా మంథాన పెర్ఫార్మెన్స్కి క్రికెట్ దిగ్గజాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
That is it! Mithali Raj finishes it off with a SIX. India win by 8 wickets and lead the three-match series 2-0. #NZvIND
— BCCI Women (@BCCIWomen) January 29, 2019
Details - https://t.co/HpmPFBz0T2 pic.twitter.com/neLHj6FJzz
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more