ఐపీఎల్ సీజన్ లో అంపైర్లు పదేపదే వార్తల్లో నిలుస్తున్నారు. నోబాల్ వివాదాలతో మొన్నటిదాకా విమర్శలు ఎదుర్కొన్న అంపైర్లు తాజాగా క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందకు కూర్చోని మ్యాచ్ ను వీక్షించిన అభిమానులందరినీ నవ్వుల్లో ముంచారు. అయితే ఇలా వారు కావాలని చేసింది కాదు. కేవలం కాకతాళీయంగా జరిదినదే.. అంపైర్ ‘గజనీ’ అవతారం ఎత్తడంతో.. కాసేపు స్టేడియంలో నవ్వులు విరిసాయి. ఆ తరువాత తనతో జరిగిన తప్పు తెలుసుకన్న అంపైర్ నాలుక కర్చుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కింగ్స్ ఎలివెన్ పంజాబ్ జట్టుకు మధ్య మ్యాచ్ జరుగింది. ఈ క్రమంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కింగ్స్ లెవన్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా పదమూడు ఓవర్లు వేసిన తరువాత అంపైర్ టైమ్ అవుట్ బ్రేక్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో శంషుద్దీన్, బ్రూస్ ఆక్సెన్‌ఫర్డ్ అంపైర్లుగా వ్యవహరించారు. తొలి ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ వేసేందుకు పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్ పుత్ సిద్ధమయ్యాడు. బంతి కోసం కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను అడిగాడు. ఆటగాళ్లెవరి దగ్గరా బంతి లేకపోవడంతో అశ్విన్ అంపైర్ శంషుద్దీన్‌ను సంప్రదించాడు.
బంతి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇక లాభంలేదని భావించిన అంపైర్లు కొత్త బంతి తీసుకురావాలని కోరారు. సిబ్బంది బాల్ కిట్‌తో మైదానంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో థర్డ్ అంపైర్ బంతి కోసం పెద్ద స్క్రీన్‌లో రిప్లే వేశాడు. అయితే, ఆ వీడియోలో శంషుద్దీన్ జేబులోనే బంతి ఉన్నట్లు తేలింది. స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ సమయంలో బంతిని తీసుకున్న అంపైర్ శంషుద్దీన్.. దాన్ని తన జేబులో వేసుకున్నాడు. కానీ, ఆ విషయం మరిచిపోయాడు. ఇదంతా రిప్లేలో చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూశాయి. పొరపాటును తెలుసుకున్న ఆ అంపైర్ కొత్తబంతిని తీసుకొస్తున్న సిబ్బందిని వెనక్కి పంపించాడు.
— Sai Kishore (@SaiKishore537) April 25, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more