Ricky Ponting as coach of Team India in future? టీమిండియా భవిష్యత్ కోచ్ రికీ పాంటింగేనా.?

Ricky ponting can be a great candidate for india coach sourav ganguly

sourav ganguly, Ricky Ponting, great candidate, ICC World Cup 2019, Ravi Shastri, Anil Kumble, West Indies,Kolkata Knight Riders,Icc World Cup Schedule,ICC World Cup,Delhi Capitals,Cricket World Cup,andre russell, Australia India, australia, cricket, cricket news, sports news, latest sports news, sports

The former India skipper said that while Ponting has the credentials of becoming India’s next coach, he said he is not too sure over whether the Australian would be willing to spend around 8-9 months in a year away from the family.

టీమిండియా భవిష్యత్ కోచ్ రికీ పాంటింగేనా.?

Posted: 05/01/2019 07:06 PM IST
Ricky ponting can be a great candidate for india coach sourav ganguly

టీమిండియా ప్రధాన కోచ్ పదవిలో కోనసాగుతున్న రవిశాస్త్రీ.. పదవీకాలం ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ టోర్నమెంటు ముగింపుతో ముగియనున్న నేపథ్యంలో అప్పుడే మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ పేరును తెరపైకి తీసుకువచ్చింది టీమిండియా సలహా కమిటీలో ఒకరైన సలహాదరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇంతకీ ఆ పదవిని ఎవరినీ ఎంపిక చేయనున్నారో తెలుసా.? అసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ఆయన గొప్ప ఎంపికని కూడా సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఏడాదిలో 8 నుంచి 9 నెలల పాటు స్వదేశానికి దూరంగా వుంటున్న రికీ పాంటింగ్.. అందుకు ముందు అంగీకరిస్తారా.? అంటూ గంగూలీ తిరిగి ప్రశ్నించారు. అయితే ఆయన తన అంగీకారాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో కోచ్ పదవికి తాను ధరఖాస్తు చేసుకన్న నేపథ్యంలో అతడ్ని ఎంపిక చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా బిసిసిఐ సలహా మండలి ఎంపిక చేస్తుందా.? అన్న విషయాన్ని వేచి చూడాలి.

కాగా.. ప్రపంచ కప్ ముగిసిన తరువాత కోచ్ ఎంపిక విషయాన్ని చూడాల్సిన క్రమంలో ఇప్పుడే ఈ అసక్తికర అంశం చర్చకు రావడమేంటీ అంటారా.? ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్, సలహాదారుడిగా గంగూలీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఆ జట్టును పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలపడమే కాకుండా.. ప్లేఆఫ్‌కి కూడా చేర్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతుండగా.. ‘పాంటింగ్ భవిష్యత్‌లో టీమిండియాకి హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దాదా.. పరోక్షంగా అవుననే సంకేతాలిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  Ricky Ponting  great candidate  Ravi Shastri  TeamIndia  australia  cricket  

Other Articles