క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన వరల్డ్ కప్ సంబరం ముగిసిందో లేదో.. ఇక టీమిండియా సెమీస్ లో వెనుదిరగటానికి కారణాలను అటుంచింతే.. అందరి దృష్టి మాత్రం టీమిండియా మాజీ సారధి.. మహేంద్ర సింగ్ ధోనిపైనే వుంది. అలా ఎందుకో చెప్పకుండానే మీరు గెస్ చేస్తున్నారని మాకు తెలుసు. మళ్లీ ధోని క్రికెట్ రిటైర్మంట్ గురించే క్రికెట్ వర్గాల్లో భారీఎత్తున్న చర్చ జరుగుతుందన్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కు ధోనిని ఎంపిక చేస్తారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనికి మద్దతు పలుకుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ధోనీ ఒక గొప్ప ఆటగాడని... నిస్వార్థంగా దేశం కోసం ఆడాడని జగ్ధలే కితాబిచ్చారు. ధోనీలాంటి వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ కు ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదని తెలిపారు.
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకునే మెచ్యూరిటీ ధోనీకి ఉందని బీసీసీఐ సెక్రటరీగా కూడా పని చేసిన జగ్దాలే తెలిపారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిణితి ధోనీకి ఉందని చెప్పారు. సచిన్ టెండూల్కర్ విషయంలో వ్యవహరించిన మాదిరిగానే... ధోనీతో సెలెక్టర్లు మాట్లాడాలని, భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more