Jadeja gives death stare to umpire for a wide బ్యాట్స్ మెన్ కోపాన్ని చూసి వైడ్ ఇచ్చిన అంఫైర్

Ravindra jadeja gives death stare to umpire for a wide

default, india_vs_westindies, west_indies_vs_india, india_cricket_team, west_indies_cricket_team, ravindra_jadeja, carlos_brathwaite, gregory_brathwaite, gregory brathwaite, carlos brathwaite, ravindra jadeja, india vs west indies, west indies vs india, cricket, ind vs wi, wi vs ind, cricket, india, cricket, india cricket team, watch article, video article, cricket, watch free

One can’t stress the importance of umpires being on their toes all the time enough, a delay in calling a ball wide brought a death stare from Ravindra Jadeja to Gregory Brathwaite.

బ్యాట్స్ మెన్ కోపాన్ని చూసి వైడ్ ఇ చ్చిన అంఫైర్

Posted: 08/12/2019 09:01 PM IST
Ravindra jadeja gives death stare to umpire for a wide

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఫీల్డ్ అంపైర్ తప్పిదాలపై విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్‌ తొలి ఓవర్ లోనే శిఖర్ ధావన్‌ ఎల్బీడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిగెల్ లాంగ్‌ తొందరపడగా.. ఆఖరి ఓవర్‌లో మరో అంపైర్ గ్రెగోరీ బ్రాత్‌వైట్ తికమకకి గురయ్యాడు. దీంతో.. ఇరు జట్ల ఆటగాళ్లు అంపైర్ల తీరుపై మైదానంలోనే పెదవి విరిచారు. భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌‌‌లో కార్లోస్ బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌ చేశాడు.

రవీంద్ర జడేజా (16 నాటౌట్: 16 బంతుల్లో 1x4) క్రీజులో ఉండటంతో.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ఈ విండీస్ పేసర్ బంతులేశాడు. కానీ.. అవి వైడ్‌లైన్‌‌‌‌కి ఇటు అటుగా వెళ్తున్నా అంపైర్ అన్నీ లీగల్ డెలివరీలుగానే ప్రకటించాడు. ఇక ఆ ఓవర్ మూడో బంతి అయితే.. వైడ్‌ లైన్‌కి కొద్దిగా వెలుపల వెళ్లింది. అయినప్పటికీ అంపైర్ బ్రాత్‌వైట్ వైడ్ ఇవ్వకపోవడంతో రవీంద్ర జడేజా.. కొన్ని క్షణాలు అతనివైపు గుర్రుగా చూశాడు.

దీంతో.. తన తప్పుని గ్రహించిన అంపైర్.. నెమ్మదిగా వైడ్ సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్ లేట్ రియాక్షన్‌తో బౌలర్ బ్రాత్‌వైట్ తొలుత షాక్‌కి గురై.. ఆ తర్వాత తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (120: 125 బంతుల్లో 14x4, 1x6) శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ జట్టు ఛేదనకు దిగగా.. కొద్దిసేపటికే వర్షం మొదలైంది. దీంతో.. మ్యాచ్‌ని 46 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. టార్గెట్‌ని 270కి సవరించారు. కానీ.. విండీస్ 42 ఓవర్లలోనే 210 పరుగులకి ఆలౌటైంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs wi  Ravindra jadeja  carlos brathwaite  umpire  wide ball  virat kohli  Sports  Cricket  

Other Articles