Virat Kohli's stand to be unveiled విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

Virat kohli s stand to be unveiled at feroz shah kotla

virat kohli, Virat Kohli news,Virat Kohli latest news, Virat Kohli batting, Virat Kohli stand, Virat Kohli feroz shah kotla stadium, Arun Jaitley, sports, Cricket news, sports news, cricket

The whole Indian cricket team will witness the unveiling of a stand which is being named after skipper Virat Kohli at Feroz Shah Kotla Stadium.

అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

Posted: 09/09/2019 07:05 PM IST
Virat kohli s stand to be unveiled at feroz shah kotla

క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా పేరుగాంచిన కోహ్లీ సొంతగడ్డపై అపురూపమైన గౌరవానికి నోచుకున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లంతా తరలిరానుండడం కార్యక్రమానికి మరింత కళ తెచ్చిపెట్టనుంది.

ఈ వేడుక అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం టీమిండియా జట్టు ధర్మశాల పయనం అవుతుంది. కాగా, ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి కూడా పేరు మార్చుతున్నారు. ఇటీవలే కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఆయన పేరిట నామకరణం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా జైట్లీ విశేష సేవలందించడంతో ఆయన గౌరవార్థం ఈ నామకరణం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Virat Kohli stand  feroz shah kotla stadium  Arun Jaitley  sports  Cricket  

Other Articles