దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ అన్నాడు. ఈ సిరీస్ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో శతకాలు చేసిన భారత మొదటి కీపర్‌గా రికార్డులు సృష్టించిన పంత్ విండీస్‌పై రెండు టెస్టుల్లో కలిపి 58 పరుగులే చేశాడు. టీ20ల్లో చెత్త షాట్లకు ఔటయ్యాడు.
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం కఠినంగా శ్రమించానని పంత్ తెలిపాడు. వైఫల్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. సాధ్యమైనంత మేరకు శుభారంభం చేస్తానన్నారు. విండీస్ పర్యటనలో జట్టు అద్భుతంగా రాణించింది. అన్ని సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసి రావడం గొప్ప విషయం. ఒక్కసారి జట్టు అక్కడ్నుంచి తిరిగొచ్చాక గతం గతః అన్నట్టే. తర్వాతి సిరీస్‌పై దృష్టిపెడతామన్నాడు పంత్.
ఇక సౌతాఫ్రికాతో సిరీస్ సొంతగడ్డపై ఆడుతున్నాం కాబట్టి కొంత అనుకూలత ఉంటుందని కూడా అభిప్రాయపడ్డాడు. ఏదేమైనప్పటికీ శుభారంభం చేయడం కీలకమనిజ.. టీమిండియా గెలుపునకు సాయపడాలని తాను కోరుకుంటానని చెప్పాడు. సఫారీలపై రాణించడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. ధోనీని తానెంతో ప్రేమిస్తానని,.. ఇతరులు మమ్మల్ని పోల్చడాన్ని పట్టించుకోనని అన్నారు. మరింత మెరుగవ్వడం, చక్కగా ఆడటంపై దృష్టిసారిస్తానని పంత్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more