Azharuddin elected as HCA president హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నిక

Mohammad azharuddin elected as hca president with 147 votes

HCA, Hyderabad Cricket Association, Mohammad Azharuddin, Prakash Jain, dileep kumar, cricket, sports, latest cricket news, Sports news, latest sports news, Cricket news, cricket

Team India former captain Mohammad Azharuddin elected as Hyderabad Cricket Association President in the elections conducted today with a majority of 74 votes against his opponent.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా 147 ఓట్లతో అజారుద్దీన్ విజయం

Posted: 09/27/2019 07:29 PM IST
Mohammad azharuddin elected as hca president with 147 votes

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధక్ష్యుడిగా టీమిండియా మాజీ సారథి, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఘన విజయం సాధించాడు. ఇవాళ జరిగిన ఎన్నికలలో ఆయన తన ప్రత్యర్థులపై 147 ఓట్లతో గెలుపొందారు. మొత్తం 223 ఓట్లు పోలవగా.. అజార్‌కు 147 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి ప్రకాశ్ జైన్‌కు 73 ఓట్లు పోలవగా.. మరో అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 227 ఓట్లకు గాను.. 223 మంది స‌భ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉప్పల్ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ హెచ్‌సీఏ ఎన్నికలు జరిగాయి. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ ల‌క్ష్మణ్ చివరి నిమిషంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా అజార్ ప్యానెల్‌కు చెందిన జాన్ మనోజ్ విజయం సాధించారు. 49 ఓట్ల ఆధిక్యంతో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా మనోజ్ గెలుపొందారు. ఫలితాల అనంతరం ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో అజారుద్దీన్ వర్గం సంబురాలు చేసుకుంది. 56 ఏళ్ల అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్‌లు ఆడారు.

అజారుద్దీన్ ప్యానెల్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అజార్ గెలుపు కోసం తెరవెనుక మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఆది నుంచి అజారుద్దీన్ దూకుడుగా కనిపించడంతో పోటీ నామమాత్రమే అయింది. మిగతా 5 స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం అజారుద్దీన్‌తో పాటు ప్రకాశ్‌ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీ పడ్డారు.

ఈసారి ఎలాగైనా హెచ్‌సీఏ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ప్రయత్నించిన అజార్ తన పంతం నెగ్గించుకున్నారు. గతేడాది చివరి గంటల్లో ఆయన నామినేషన్ రద్దు కావడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ పదవికి మాజీ అధ్యక్షుడు వివేక్ గట్టిగా ప్రయత్నించగా.. ఆయన నామినేషన్ రద్దు కావడంతో ప్రకాశ్ చంద్ జైన్‌కు మద్దతిచ్చారు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ కూడా పోటీగా నిలిచింది. కాగా తన సమీప ప్రత్యర్ధిపై 74 ఓట్లతో అజారుద్దీన్ గెలుపొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCA  Hyderabad Cricket Association  Mohammad Azharuddin  Prakash Jain  dileep kumar  cricket  sports  

Other Articles