దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తుది జట్టులో ఒక మార్పు చేశాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసిన కోహ్లీ.. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు. భారత కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే వుందని కూడా వివరించాడు.
విశాఖపట్నం వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో.. మొదటి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన విహారికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లను ఈ తెలుగు క్రికెటర్‌తో విరాట్ కోహ్లీ వేయించగా.. 38 పరుగులు ఇచ్చిన విహారి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో.. రెండో ఇన్నింగ్స్‌లో అతని చేతికి భారత కెప్టెన్ బంతినివ్వలేదు. మొత్తంగా.. వైజాగ్ టెస్టులో విహారి ప్రదర్శన ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ కనిపించలేదు.
ఈ కారణంగానే పుణె టెస్టులో అతనిపై వేటు వేశారని అంతా ఊహించారు. కానీ.. విహారిని ఎందుకు తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందో..? కోహ్లీ వివరించాడు. ‘పుణె పిచ్‌పై బౌలింగ్ చేయాలంటే కొంచెం కష్టం. అందుకే తుది జట్టులోకి ఐదో బౌలర్‌ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలకి తోడుగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేయనున్నాడు.
బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలనే కారణంతోనే హనుమ విహారి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని ఎంచుకున్నాం’ అని కోహ్లీ వెల్లడించాడు. వైజాగ్ టెస్టులో వికెట్ కీపర్‌తో కలిపి ఏడుగురు బ్యాట్స్మెన్లు, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిన టీమిండియా 203 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా తుది జట్టులోకి అదనంగా ఓ బౌలర్‌ని ఎంచుకోవడం ద్వారా.. ఒక బ్యాట్స్‌మెన్‌ని తగ్గించుకున్నట్లయింది.
భారత్ తుది జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more