Virat kohli overtakes Ganguly in test matches గంగూలీని క్రాస్ చేసి.. ధోనిని ఢికొట్టేందుకు..

Virat kohli 2nd india captain after ms dhoni to lead in 50 tests

virat kohli, virat kohli india vs south africa, india vs south africa 2nd test, pune test ind vs sa, virat kohli test captaincy, virat kohli sourav ganguly, virat kohli mahendra singh dhoni, virat kohli vs ms dhoni, rishabh pant, MS Dhoni cricket news, sports news, sports, cricket

Virat Kohli became the 2nd Indian after MS Dhoni to lead in 50 Tests when he walked out for the toss for the 2nd Test of a 3-match series against South Africa in Pune.

గంగూలీని క్రాస్ చేసి.. ధోనిని ఢికొట్టేందుకు..

Posted: 10/10/2019 01:21 PM IST
Virat kohli 2nd india captain after ms dhoni to lead in 50 tests

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనతికాలంలోనే తన ఖాతాలో సరికొత్త రికార్డును వేసుకునేందుకు పరుగులు తీస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇవాళ పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌‌‌లో టాస్‌కి వెళ్లిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 50 టెస్టుల్లో టీమిండియాకి కెప్టెన్సీ వహించిన భారత క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ ముందు వరకూ 49 టెస్టుల కెప్టెన్సీతో సౌరవ్ గంగూలీ సరసన ఉన్న విరాట్ కోహ్లీ.. ఈరోజు అతడ్ని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.

ఈ రికార్డులో కోహ్లీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఉన్నాడు. అయితే మరో పది టెస్టు మ్యాచులకు కోహ్లీ సారధ్యం వహిస్తే ధోని రికార్డును కూడా అధిగమించేసినట్టే అవుతోంది. ధోనీ మొత్తం 60 టెస్టుల్లో భారత్ జట్టుకి కెప్టెన్సీ వహించగా.. ఇందులో 27 విజయాలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ 50 టెస్టుల్లోనే ఇప్పటికే 29 విజయాల్ని అందుకోగా.. పుణె టెస్టు సహా రాంచీ టెస్టులు కూడా స్వదేశంలోనే అడుతున్న కారణంగా ఈ రెండింటీలోనూ విజయాన్ని అందుకుని తన విజయాల పట్టికను మరింత మెరుగుపర్చుకునే అవకాశాలున్నాయి.

టెస్టుల్లో భారత్ జట్టుకి ఎక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. మహేంద్రసింగ్ ధోనీ 60 టెస్టుల్లో సారథ్యం వహించిన అగ్రస్థానంలో కోనసాగుతుండగా, విరాట్ కోహ్లి 50(*) టెస్టులతో రెండవస్థానంలో వున్నాడు. ఇక తృతీయ స్థానంలో సౌరవ్ గంగూలీ (49 టెస్టు మ్యాచుల కెప్టెన్సీతో), సునీల్ గవాస్కర్ (47 టెస్టు మ్యాచుల కెప్టెన్సీతో), మహ్మద్ అజహరుద్దీన్ (47 టెస్టు మ్యాచుల కెప్టెన్సీతో), పటౌడి (40 టెస్టు మ్యాచుల కెప్టెన్సీతో) టాప్-6లో ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. పుణె టెస్టు మ్యాచ్‌ సోమవారం ముగియనుండగా.. ఆ తర్వాత రాంచీ వేదికగా ఈ నెల 19 నుంచి మూడో టెస్టు జరగనుంది. ఈ లెక్కన మరో పది టెస్టు మ్యాచులకు కోహ్లీ సారధ్యం వహించి.. మరిన్ని విజయాలను తన జాబితాలోకి చేర్చుకుంటే.. టీమిండియా టెస్టు కెప్టెన్సీలో అగ్రస్థానంలో నిలిచే రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india vs south africa  pune 2nd test  saurav ganguly  MS Dhoni  cricket  sports  

Other Articles