ఇంగ్లండ్ క్రికెట్ లెజండ్ బాబ్ విల్లిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, మరణవార్తను ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు, దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కొందరు 1981లో యాషెస్ సిరీస్ లో అస్ట్రేలియాపై విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయాన్ని రమారమి అందరూ క్రికెటర్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన బంతి వేగానికి కళ్లాలు లేవని కొనియాడుతున్నారు. అందుకనే ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రపై లిఖించిన అక్షరాలు ఇప్పటికే చెరిగిపోలేదు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు కావస్తున్న ఇప్పటికే ఆయన అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్ గా కొనసాగడమే ఇందుకు నిదర్శనం.
కాగా, 1971లో క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన ఆయన, 90 టెస్టులు, 64 వన్డేల్లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 325 వికెట్లు తీసుకున్నారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక చాలాకాలం పాటు కామెంటేటర్ గా పనిచేశారు. బాబ్ విల్లీస్ మృతి పట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసెర్ హుస్సెన్, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, న్యూజీలాండ్ మాజీ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ, ది టైమ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మ్యాచ్ డికిన్ సన్, ఇంగ్లాండ్ మాజీ అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్ర్బేస్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డారెన్ గాఫ్, బాబ్ విల్లీస్ సహచర క్రికెటర్ జియోఫ్రీ బాయ్ కాట్ తదితరులు తమ సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more