పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ టీమిండియా క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా పేస్ దిగ్గజం జస్ప్రిత్ బుమ్రా తరువాత ఆయన ఏకంగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కోహ్లీ నిలకడగా ఆడుతుండొచ్చు గానీ దిగ్గజ ఆటగాడైన సచిన్ తెందూల్కర్ క్లాస్ అతడిలో లేదంటున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆయన పేర్కొన్నాడు.
తాము ఆడిన 1992-2007 కాలం నాటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తనకిప్పుడు కనిపించడం లేదని అన్నాడు. టీ20 క్రికెట్ ఆటను సమూలంగా మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పస లేకుండా పోయిందని.. ఇప్పుడంతా సాధారణ క్రికెట్ ఆడుతున్నారని అన్నాడు. ఒకసారి విరాట్ కోహ్లీని చూడండి. చేసినప్పుడే పరుగులు చేస్తాడని.. టీమిండియాకు అతనో మంచి ఆటగాడని.. నిలకడగా రాణిస్తాడని అయినా.. సచిన్ తెందూల్కర్ క్లాస్ కు మాత్రం చెందడని అభిప్రాయపడ్డాడు. సచిన్ ప్రత్యేకమైనవాడని రజార్ చెప్పుకోచ్చాడు.
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను బేబీ బౌలరని వ్యాఖ్యానించాడు రజాక్. తానిప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఉండుంటే బుమ్రాపై సులభంగా ఆధిపత్యం చెలాయించే వాడినని పేర్కొన్నాడు. కెరీర్లో ప్రపంచ స్థాయి పేసర్లు గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్‌తో ఆడిన తనకు బుమ్రాను ఎదుర్కోవడం ఓ లెక్క కాదని పేర్కోన్నాడు. తనకు బౌలింగ్ చేస్తే ఒత్తిడి బుమ్రాపైనే ఉంటుందని రజాక్ అన్నాడు. అయితే.. అతడి బౌలింగ్ శైలిని మాత్రం ప్రశంసించాడు. ‘బుమ్రా బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుందని అన్నాడు. అనుకున్న ప్రాంతంలో బంతిని కచ్చితంగా విసరగలడని.. అందుకే అంత ప్రభావం చూపిస్తున్నాడని రజాక్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more