టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని 'నోట్‌బుక్'గా మార్చి.. టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా తన వికెట్ తీసి సంబరాలు చేసుకున్న విలియమ్స్ కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు 50 బంతుల్లో 94 పరుగులు చేసిన కోహ్లీ.. 54 పరుగుల వద్ద కొనసాగుతున్న సమయంలో విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్ లో కళ్లు చెదిరే సిక్సర్ గా మలిచాడు. సిక్సర్ కొట్టిన తర్వాత కోహ్లి అదే నోట్ బుక్ స్టయిల్ లో ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం దీనిపై విరాట్ మాట్లాడుతూ.. గత వెస్టిండీస్ పర్యటనలో తనని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసిన సెలబ్రేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.
#ViratKohli don't mess with Kohli
— Venky Tarak (@VenkyTa77508681) December 7, 2019
If ur bad he's ur dad pic.twitter.com/YsDNipUlMJ
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more