దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫా డుప్లెసిస్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా జట్టు మరింత ముందుకు వెళ్లడానికి అవకాశాలు వుండటంతో పాటు.. యువనాయకత్వం రానున్న కాలంలో మరిన్ని విజయాలను అస్వాధించడానికి.. దేశానికి అందించడానికి అస్కారం వుంటుందని తెలిపాడు.
కాగా డుప్లెసిస్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు సోమవారం స్పష్టం చేసింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన.. 2020 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్‌గా తన కెరీర్ కొనసాగించడంపై దృష్టి సారించలేనని చెప్పాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు డుప్లెసిస్ విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో కీపర్ క్వింటన్ డికాక్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
అయితే, ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా అటు టెస్టు సిరీస్, ఇటు టీ20 సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్త నాయకత్వంలో యువ ఆటగాళ్లు సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు, అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జట్టుకు ఎంతో మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుప్లెసిస్ ఒక ప్రకటనలో చెప్పాడు. ఇదెంతో కఠినమైన నిర్ణయం అయినప్పటికీ క్వింటన్ డికాక్‌కు సహకరించడానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more