MS Dhoni smashes five sixes ahead of IPL 2020 పవర్ తగ్గలేదు.. సిక్సర్లతో ఊపుతెచ్చిన ధోని

Ms dhoni sounds warning bells smashes five sixes ahead of ipl 2020

MS Dhoni , Chennai Super Kings , IPL 2020, Yuvraj singh, Rohit Sharma, IPL, dhanadhan dhoni, 5 Sixes, 5 Balls, Chennai Super Kings, sports, cricket,

M.S. Dhoni will be back to playing competitive cricket for the first time since July 2019 at this year's Indian Premier League and the Chennai Super Kings captain has been busy at the Chepauk Stadium in Chennai as he is busy training with his team.

విమర్శకులకు తన బ్యాటుతో బదులు చెప్పిన ధోని

Posted: 03/07/2020 07:56 PM IST
Ms dhoni sounds warning bells smashes five sixes ahead of ipl 2020

ధోనీ అంటేనే ఎంతటి ఒత్తిడి పరిస్థుల్లోనైనా కూల్ గా వుండాటని మిస్ట్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అది మైదానంలో ఫీల్డిండ్ చేస్తున్నప్పుడు మాత్రమే. కానీ బ్యాటింగ్ చేస్తున్నంత సేవు అతడి అభిమానులు అతడికి పెట్టిన పేరు మ్యాచ్ విన్నర్.. అదే అచ్చంగా భారతీయులు పిలుచుకునే పేరు ధనాధన్ ధోని. బంతిని అలవోకగా బౌండరీ అవతలికి తరలించి.. అప్పటి వరకు ఎంత ఒత్తడిలో వున్న మ్యాచ్ మొత్తాన్ని టీమిండియా వైపు తిప్పుతూ.. ఒత్తడిని దూరం చేయడంలో సిద్దహస్తుడు.

అయితే 2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ భారత్ తరపున ఆడలేదు. ఆయన కెరీర్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ శకం ముగిసినట్టేనని పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా చర్చించుకునే స్థాయికి ఆయన తగ్గిపోయారా.? ఇది నిజమేనా.. మరి ఐపీఎల్ పై పూర్తి నమ్మకంతో బ్యాటు పట్టి మైదానంలోకి దిగుతున్న ధోని దీనిని ఐపీఎల్ లో దూరం చేసుకుంటాడా.? తిరిగి టీమిండియా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంటాడా.? అన్నఅనుమానాలు అభిమానుల్లోనూ రేకెత్తుతున్నాయి.


అయితే తాను క్రికెట్ కు కొంతకాలంగా దూరంగా వున్న మాట వాస్తవమే కానీ.. తనలో క్రికెట్ ఆడాలన్న తపన, క్రికెట్ షాట్లు కొట్టాలన్న సత్తా ఏమాత్రం తగ్గలేదని ధోని తన బ్యాటుతో విమర్శలకు బదులు చెప్పాడు. ఐపీఎల్ కోసం ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీ ప్రాక్టీస్ కోసం చెన్నై చేరుకున్నాడు. నిన్న నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 'ఔరా' అనిపించాడు. ధోనీ విశ్వరూపాన్ని స్టార్ స్పోర్ట్స్ తమిళ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  IPL  dhanadhan dhoni  5 Sixes  5 Balls  Chennai Super Kings  sports  cricket  

Other Articles