వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ కామెంటేటర్ గా తొలగించిన సంగతి తెలిసిందే. సంజయ్ మంజ్రేకర్ పై వేటు వేసినట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నా, వాటిలో అధికారిక సమాచారం ఏదీ లేదు. దీనిపై సంజయ్ మంజ్రేకర్ స్వయంగా స్పందించాడు. తనను బీసీసీఐ తొలగించిన విషయం వాస్తవమేనని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన మంజ్రేకర్, బీసీసీఐ నిర్ణయాన్ని పక్కా ప్రొఫెషనల్ గా అంగీకరిస్తున్నానని తెలిపాడు.
"కామెంటరీ చెప్పడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అదో ఉపాధి అవకాశం అని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను కొనసాగించాలో, వద్దో అనేది నన్ను నియమించుకున్న సంస్థకు చెందిన విషయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పాటిస్తాను. బీసీసీఐ ఇక ఎంతమాత్రం నా పెర్ఫార్మెన్స్ పట్ల సంతృప్తి చెందదు అనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.
మంజ్రేకర్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకోవడం ఎన్నో పర్యాయాలు జరిగింది. ముఖ్యంగా, వరల్డ్ కప్ సమయంలో రవీంద్ర జడేజాను ఉద్దేశించి 'బిట్స్ అండ్ పీసెస్' ఆటగాళ్లను నేను పెద్దగా ఇష్టపడను అంటూ వ్యాఖ్యానించాడు. జట్టులోకి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే ఆటగాళ్లంటే తనకు నచ్చదే అనే ఉద్దేశంలో మంజ్రేకర్ ఆ వ్యాఖ్యలు చేయగా, జడేజా దీటుగా బదులిచ్చాడు. 'నీ నోటి విరేచనాలు ఇక ఆపు' అంటూ తీవ్రంగా స్పందించాడు. అటు తర్వాత కూడా మంజ్రేకర్ మారిందేమీ లేదు. మరికొందరిపైనా అదే తరహాలో వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more