India vs South Africa: India win by 113 runs సెంచురీయన్ టెస్టులో టీమిండియా భారీ విజయం..

India vs south africa 1st test india register first win at centurion

India Vs South Africa Live,IND vs SA,IND vs SA Live Score,India Vs South Africa,India Vs South Africa 1st Test,India Vs South Africa 1st Test Live Score,India Vs South Africa Live Cricket Score,India Vs South Africa 2021,India Vs South Africa Test,India Vs South Africa Highlights,India Vs South Africa Live Score Today,India Vs South Africa Team,India Cricket Team,South Africa Cricket Team,India Vs South Africa Scorecard,India vs South Africa Test Series,India Tour of South Africa 2021, sports news, cricket news, Sports, Cricket

India wrapped the South Africa second innings on 191 and won the opening Test in Centurion by 113 runs. With this the visitors go 1-0 up in the three-match series. Mohammed Shami picked the first wicket after Lunch and R Ashwin scalped the final two wickets in consecutive deliveries to help India win their first Test in Centurion. Temba Bavuma remained unbeaten on 35.

సెంచురీయన్ టెస్టులో టీమిండియా భారీ విజయం.. 113 పరుగులతో గెలుపు.!

Posted: 12/30/2021 08:52 PM IST
India vs south africa 1st test india register first win at centurion

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. 113 ర‌న్స్ తేడాతో కోహ్లీ సేన విజ‌యం సాధించింది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో 305 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌ఫారీలు.. కేవ‌లం 191 ర‌న్స్‌కే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా, ష‌మీలు చెరి మూడేసి వికెట్లు తీయ‌గా.. సిరాజ్‌, అశ్విన్‌లు రెండే వికెట్ల‌ను ప‌డగొట్టారు. సౌతాఫ్రికా జ‌ట్టులో ఎల్గ‌ర్ 77, బ‌వుమా 35 ర‌న్స్ చేశారు. సెంచూరియ‌న్‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసిన టీమిండియా.. ఈ ఏడాదికి స్వీట్ విక్ట‌రీతో గుడ్‌బై చెప్పింది.

నిజానికి తొలి రోజే ఇండియా ఆధిప‌త్యాన్ని చాటింది. ఆ త‌ర్వాత రెండ‌వ రోజు వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచిపోయింది. ఇక మూడ‌వ రోజు ఏకంగా 18 వికెట్లు ప‌డ్డాయి. అక్క‌డే మ్యాచ్ స్వ‌రూపం మొత్తం మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌.. అద్భుత‌మైన సెంచ‌రీతో ఇండియాను ఆదుకున్నారు. దాంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. కానీ వ‌ర్షం త‌ర్వాత సెంచూరియ‌న్ పిచ్ పూర్తిగా మారిపోయింది. ఆ పిచ్‌పై బౌల‌ర్లు త‌మ స‌త్తా చాటారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియాను 174 ర‌న్స్‌కే ఔట్ చేశారు స‌ఫారీలు. ఇండియ‌న్ బౌల‌ర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లోనూ రాణించారు. సౌతాఫ్రికాను రెండ‌సార్లు 200 స్కోర్ లోపే ఔట్ చేశారు. సెంచ‌రీ హీరో రాహుల్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

స్కోరు బోర్డు
ఇండియా 327, 174
సౌతాఫ్రికా 197, 191

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles