దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెంబా బవుమా సేన.. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ధాటికి కుప్పకూలింది.
తస్కిన్ అహ్మద్ ప్రోటీస్ జట్టును బంతితో దెబ్బతీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన బ్యాట్స్ మెన్లను ఎవరినీ క్రీజులో నిలువనీయకుండా వెంటవెంటనే వెనక్కు పంపాడు. తస్కీన్ దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. తస్కిన్ 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 37 ఓవర్లలో 154 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో జానెమన్ మలాన్ చేసిన 39 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కేశవ్ మహారాజ్ 28, డ్వైన్ ప్రెటోరియస్ 20 పరుగులు చేశారు. షకీబల్ హసన్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిటన్ దాస్ (48), కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 20.5 ఓవర్లలో 127 పరుగులు జోడించారు. అనంతరం లిటన్ దాస్ అవుట్ కాగా, క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ 18 పరుగులు చేసి మిగతా పని పూర్తి చేశాడు. ఫలితంగా 9 వికెట్ల భారీ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తస్కిన్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. బంగ్లాదేశ్ చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more