David villa in tears after being substituted in his last game

David Villa in tears after being substituted in his last game, spain player david villa, david villa in tears after end the match, David Villa in tears after being substituted in his last game, spain won against the australia team, spain and australia game

David Villa in tears after being substituted in his last game

ఆటగాణ్ణి ఏడిపించిన చివరి ఆట

Posted: 06/24/2014 12:23 PM IST
David villa in tears after being substituted in his last game

(Image source from: David Villa in tears after being substituted in his last game)

ఫిఫా వరల్డ్ కప్ 2014 గ్రూప్ - ‘బి’ లోని స్పెయిల్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరాటం కొద్దిమేరకు ఉత్సాహకరంగా సాగింది. ఈ పోరాటంలో మొదట్లో కొంచెం ఉత్కంఠభరితంగా కొనసాగినప్పటికీ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ప్రతిభను అంతగా ప్రదర్శించుకోలేకపోయారు. ప్రతమార్థంలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో.. స్పెయిన్ 3-0 గోల్స్ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది తన పరువును నిలబెట్టుకుంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొదట బంతిని తమ దగ్గరే ఎక్కువసేపు వుంచుకున్నప్పటికీ... స్పెయిన్ ఆటగాళ్లు వారికి ధీటుగా సమాధానం చెబుతూ... బంతిని తమవైపుకు లాక్కున్నారు. స్పెయిన్ జట్టు తరఫున విల్లా, టొరెన్, జువాన్ మటాలు చెరొక గోల్స్ లు సాధించి, తమ జట్టును విజయబాటవైపు ముందుకు తీసుకెళ్లారు. దీంతో స్పెయిన్ జట్టు గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

ఇక స్పెయిన్ ఆటగాడు అయిన విల్లా తన కెరీర్ లో చివరి ఆట అయిన ఈ గేమ్ లో అద్భుతమైన ప్రదర్శనను చూపించి, ప్రేక్షకజనాలను తనవైపుకు ఆకట్టుకున్నాడు. డేవిడ్ విల్లా తన ఇంటర్నేషనల్ కెరీర్ లోనే ఆఖరి మ్యాచ్ అయిన ఇందులో స్పెయిన్ కోసం రంగంలోకి దిగి మ్యాచ్ ముగిసేసమయంలో అద్భుతంగా ప్రతిభను చూపించాడు. స్పెయిన్ జట్టును అగ్రస్థానంలో కాకపోయినా... కనీసం అర్హత దక్కేలా చేయాలనే తపనతో చివరగా గోల్ సాధించి, ఆటను ముగించాడు. ఈ సంతోష సమయంలోనే, తన చివరి మ్యాచ్ కావడంతో కన్నీటిపర్యంతమయిన విల్లాను... థ్యాంక్స్ చెబుతూ అందరూ అతనికి అభినందనలు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles