Uruguay football player luis suarez bites italy defendar player

Uruguay football player Luis Suarez bites italy defendar player, Uruguay football player Luis Suarez bites italy defendar player, fifa world cup 2014, 2014 fifa world cup, 2014 fifa world cup news, italy and uruguay match, uruguay football player Luis Suarez latest news

Uruguay football player Luis Suarez bites italy defendar player

అక్కడ కొరికేశాడురా బాబోయ్..!

Posted: 06/25/2014 12:05 PM IST
Uruguay football player luis suarez bites italy defendar player

(Image source from: Uruguay football player surej bites italy defendar player)

ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 2014లో జరగరాని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు, ఏమిటి, ఎలా అవుతుందోననే విషయాలు ఎవ్వరికీ అర్థంకాని రీతిలో సాగుతున్నాయి. ఇరుపక్షాల జట్లలోని ఆటగాళ్లలో కొంతమంది గొడవలకు దిగితే... మరికొంతమంది విచిత్రంగా కొరికేసి పారేస్తున్నారు. ఇటువంటి వైనం తాజాగా గ్రూప్ - డి లో ఉరుగ్వే - ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకటి చోటుచేసుకుంది.

ఉరుగ్వే - ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి నుంచి ఇరుపక్షాల జట్టువారు ఒకరికొకరు బంతి అందకుండా బాగానే అడ్డుపడ్డారు. మ్యాచ్ చివరిదాకా ఎంతో రసవత్తరంగా సాగింది. అయితే మ్యాచ్ ముగియనున్న చివరి సమయంలో... అంటే 81వ నిముషంలో ఉరుగ్వే జట్టు ఆటగాడు గోడీస్ ఒక గోల్ సాధించాడు. దాంతో ఉరుగ్వే టీం విజయం సాధించి, నాకౌట్ కు చేరిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో అందరూ చూడని ఒక సన్నివేశం, ఇప్పుడు వెలుగులోకి రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇటలీ జట్టులో స్టార్ ఆటగాడుగా పేరొందిన సురెజ్.. నిషేధానికి గురయ్యే అవకాశాలు చాలావరకు వున్నాయని ఫిఫా మేనేజ్ మెంట్ వారు పేర్కొంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... సురెజ్ హద్దులు దాటి ప్రవర్తించాడని అతని మీద విమర్శలు చేస్తున్నారు. మరో పది నిముషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకుంటున్న సమయంలో.. ఇటలీ డిఫెండర్ గోల్ పోస్టు దగ్గర బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటే... సురేజ్ అతని మీద విరుచుకుపడి భుజంపై కొరికే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ ఆటగాడు ఒక్కసారిగా అరిచేశాడు. ఏం జరిగిందోనని రీప్లేలో తిరిగి చూస్తే.. సురెజ్, ఇటలీ ఆటగాడి భుజం మీద కొరికినట్లుగా స్పష్టంగా దృశ్యాలు కనిపించాయి.

సురెజ్ ఈ విధంగా ప్రవర్తించిన వైఖరిపై ఇటలీ టీం మేనేజ్ మెంట్ రిఫరీకి అప్పటికప్పుడే ఫిర్యాదు చేసింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని, దీనిపై అంతగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని రిఫరీ సర్దిచెప్పాడట! ఒకవేళ సురెజ్ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యకు పాల్పడి వుంటే అతనిపై వేడు పడే అవకాశాలు వున్నాయని మేనేజ్ మెంట్ వారు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles