Star players has get goals easily in fifa world cup 2014

star players has get goals easily in fifa world cup 2014, fifa world cup 2014, 2014 fifa world cup, argentina player messy, nigeria player moses, fifa world cup news, fifa world cup matches

star players has get goals easily in fifa world cup 2014

అభిమానులను సందడి చేయించిన స్టార్ ఆటగాళ్లు

Posted: 06/26/2014 10:59 AM IST
Star players has get goals easily in fifa world cup 2014

(Image source from: star players has get goals easily in fifa world cup 2014)

ఫిపా వరల్డ్ కప్ 2014లో గ్రూప్-ఇ, గ్రూప్-ఎఫ్ విభాగాల్లో జరిగిన మ్యాచ్ లు ఎంతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ మ్యాచ్ లను తిలకించిన అభిమానులందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తమ అభిమాన జట్లు ఆడుతున్న తీరుతో మైదానం మొత్తం కేకలు, అరుపులతో సందడి చేశారు. ముఖ్యంగా ఈ ఆటల్లో స్టార్ ఆటగాళ్లు మెరిసిపోయారు. ఇతర ఆటగాళ్లకు బంతి చిక్కనివ్వకుండా తమ అధీనంలోనే వుంచుకుని ముచ్చెమటలు పట్టించారు.

అగ్రస్థానాలలో నిలిచిన జట్టుల్లోని స్టార్ ఆటగాళ్లు ఈసారి అద్భుతమైన ప్రదర్శనను చూయించారు. అర్జెంటీనా జట్టులో స్టార్ ఆటగాడు అయిన మెస్సీ రెండు గోల్స్ వేసి తన జట్టును విజయబాటవైపు ముందుకు నడిపించాడు. మెస్సీ సాధించిన ఈ రెండు గోల్స్ వల్ల గోల్డెన్ బూట్ రేసులో వున్న బ్రెజిల్ ఆటగాడు నెయమార్ ను(4) అందుకున్నాడు. అలాగే నైజీరియా ఆటగాడు మూసా కూడా రెండు గోల్స్ సాధించి, అందరి దృష్టిలో మరోసారి స్టార్ ఆటగాడుగా నిలిచిపోయాడు.

అయితే వీరికి ధీటుగా స్విట్జర్లాండ్ క్రీడాకారుడు అయిన సాక్యూరి ఏకంగా మూడు గోల్స్ సాధించి అందరిని కనువిందు చేశాడు. సాక్యూరి ఈ విధంగా హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో స్విట్జర్లాండ్ సులభంగా విజయాన్ని సాధించింది. ఆట ప్రారంభం నుంచే ఈ ఆటగాడు తన దూకుడును ప్రదర్శించాడు. మొదట 6వ నిముషంలో ఒక గోల్ వేసిన ఇతగాడు.. ఆ తరువాత 31, 71వ నిముషాల్లో గోల్స్ వేసి, జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

ఈ విధంగా స్టార్ ఆటగాళ్లు ప్రతిభను ప్రదర్శించి అభిమానులందరినీ ఉర్రూతలూగించారు. అయితే ఈ మ్యాచ్ లు ముగిసేసరికి అర్జెంటీనా, నైజీరియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ జట్లు ముందంజలో నిలబడ్డాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles