Germany beats brazil 7 1 in semifinal fifa world cup

Germany beats Brazil 7-1 in semifinal FIFA world cup, FIFA World Cup 2014 Semifinal Highlights, FIFA World Cup 2014 Tracker, World Cup 2014 1st Semifinal Highlights, Germany celebrate after entering the eighth World Cup final, Brazil vs Germany

Germany beats Brazil 7-1 in semifinal FIFA world cup

బ్రెజిల్ ఫుట్ బాల్ చరిత్రలోనే ఘోరంగా ఓడింది

Posted: 07/09/2014 12:01 PM IST
Germany beats brazil 7 1 in semifinal fifa world cup

ప్రపంచంలోని ఫుట్ బాల్ అభిమానులు ఇన్ని రోజులు జరిగిన ఫిఫా వరల్డ్ లీగ్ దశ మ్యాచ్ ల్లో, క్వార్టర్స్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ లో ఏమంతా మజా ఆస్వాదించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు బలాబలాలు సమానంగా ఉన్న జట్లు తలపడలేదు. ఫిఫాలో సెమీ ఫైనల్ మ్యాచ్ లో అసలు సిసలైన మ్యాచ్ ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కారణం ప్రపంచ ఫుట్ బాల్ అగ్రశ్రేణి జట్లు బ్రెజిల్, జర్మనీలు తలపడటమే.

రాత్రిళ్ళు నిద్రలు మాని కళ్ళు కాయలు కాసేలా చూసిన ఎలాంటి కిక్ నివ్వకుండా మనం చూస్తున్నది ప్రపంచ అగ్రశ్రేణి జట్ల మ్యాచేనా అనే విధంగా ఏక పక్షంగా సాగింది. ఫుట్ బాల్ మ్యాచ్ లో గోల్ కొట్టడం కష్టమనే ఫీలింగ్ ఉన్నవారు ఇంత ఈజీగా కొట్టవచ్చా అనే ఫీలింగ్స్ కి వచ్చారు. బ్రెజిల్ ఆటగాళ్ళు ప్రత్యర్థిని ఏ మాత్రం నిలువరించక పోయారు. ఇదే అదనుగా భావించిన జర్మనీ గోల్
పోస్టుల పై దండయాత్ర చేసి 18 నిమిషాలలోనే 5 గోల్స్ సాధించి ఎదురులేని ఆధిక్యాన్ని సంపాదించుకొంది.

అంత్యంత ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో బ్రెజిల్ 7-1 తేడాతో ఓడిపోయింది.  జర్మనీ చేతిలో చావుదెబ్బతిన్న బ్రెజిల్ తన వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత భారీ ఓటమి నమోదు చేసుకుంది. గతంలో 1998 వరల్డ్ కప్ ఫ్రాన్స్ 3-0తో బ్రెజిల్ ను చిత్తు చేసింది. నిన్నటివరకు బ్రెజిల్ చరిత్రలో ఇదే భారీ ఓటమి. తాజాగా సెమీస్ తో ఆ ఓటమి తెరమరుగైంది. కాగా,

అంతర్జాతీయ మ్యాచ్ లలోనూ ఆ జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమి రికార్డు. 1920లో ఉరుగ్వే చేతిలో 0-6తో భంగపడింది. ఇప్పుడా రికార్డు సమమైంది. ఇక జర్మనీ జట్టులోని వెటరన్ ఫార్వర్డ్ మిరోస్లావ్ క్లోజ్ (36) వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్ సాకర్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. బ్రెజిల్ తో సెమీస్ లో చేసిన గోల్ తో క్లోజ్ ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీల్లో 16 గోల్స్ సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles