England vs india 1st test murali vijay helps to india 259 4

England vs India 1st Test, Cricket, Eng vs Ind 2014,Trent Bridge, Nottingham,MS Dhoni,Stuart Binny,England,India England vs India, 1st Test, Day 1: Murali Vijay 122

England vs India 1st Test Match

ఇంగ్లీష్ గడ్డ పై తొలి రోజు మనోళ్ళదే

Posted: 07/10/2014 12:29 PM IST
England vs india 1st test murali vijay helps to india 259 4

గత పరాభవాన్ని తలుచుకొంటూ ఇంగ్లాండ్ గడ్డ పై అడుగు పెట్టిన ధోని సేన ఎలా ఆడుతామోనని లోలోపల మధన పడింది. కానీ ట్రెంట్ బిడ్జిలో అధిరే ఆరంభం చేసింది. తొలి టెస్టు మొదటి రోజు నిలకడగా ఆడి ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ 122 (294 బంతులు, 20 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఆయనకు ధోని తోడయ్యి 64 బంతుల్లో 4 ఫోర్లతో అర్థ సెంచరీతో క్రీజ్ లో ఉన్నాడు. ఓపెనర్ ధావన్ (12) విఫలమయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డప్పటికీ... 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా యువ సంచలనం కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రహానె 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అభేద్యమైన ఐదో వికెట్ కు విజయ్, ధోనీలు 81 పరుగులు జోడించారు. దీంతో, ఆట తొలి రోజు ఆటముగిసే భారత్ 259 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత్ అనుకున్న రీతిలో ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 2, బ్రాడ్, ప్లంకెట్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు కూడా ఇలానే నిలకడగా ఆడితే తొలి టెస్టు పై పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles