Neymar message to messi beat the germans

Neymar message to Messi Beat the Germans, Brazil team palyer Neymar, Neymar' message to Messi, Neymar' support to Messi, Foot ball palyer Neymar

Neymar' message to Messi Beat the Germans

జర్మనీని చిత్తుగా ఓడించమంటున్న నేమార్

Posted: 07/11/2014 04:08 PM IST
Neymar message to messi beat the germans

చాలా సంవత్సరాల తరువాత సొంత గడ్డ పై జరుగుతున్న ఫిఫా సాకర్ వరల్డ్ కప్ సెఫీ ఫైనల్లో పుట్ బాల్ కి పెట్టింది పేరైన బ్రెజిల్ జట్టు జర్మనీ పై అంత్యంత దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఆ జట్టు ఆటగాళ్ళే కాకుండా, దేశ ప్రజలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆటగాళ్ళతో సహా దేశ ప్రజలందరు కన్నీటి పర్యంతం అయ్యారంటే ఫుట్ బాల్ పై ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోసుకోవచ్చు.

గత రెండు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్లో ఓ అంతర్జాతీయ స్థాయి జట్టు ఓ క్లబ్బు స్థాయి ప్రదర్శకంటే దారుణంగా చేసి ఓడటంతో ఇప్పుడు ఆ దేశ ఆటగాళ్ళు జర్మనీ పై ఎంతో కసిగా ఉన్నారు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్ కి వెన్నుముక గాయం కారణంగా దూరం అయిన నేమార్ రగిలిపోతున్నాడు. జర్మనీ చేతిలో 1-7 తేడాతో బ్రెజిల్ ఓడడాన్ని నేమార్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అదీ సొంతగడ్డపై ఓడడం అవమానకరంగా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుడు, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లయొనెల్ మెస్సీకి ఓ సందేశం పంపాడు.

ఫైనల్లో జర్మనీని చిత్తుగా ఓడించాలని సూచించాడు. వెన్నెముక గాయం కారణంగా సెమీస్ కు దూరమవడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. క్వార్టర్ ఫైనల్లో తన గాయానికి కారణమైన కొలంబియా డిఫెండర్ జునిగాను క్షమించానని తెలిపాడు. నేమార్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జర్మనీ పై ఎంత కసితో ఉన్నాడో అర్థం అవుతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles