Bhuvi and shami last wicket notch up record partnership

Bhuvi-Shami last-wicket partnership, Bhuvneshwar Kumar, Mohammed Shami, partnership, India Vs England, 1st Test

Bhuvi, Shami last-wicket notch up record partnership

ఇంగ్లాండ్ గడ్డ పై భువీ, షమీ రికార్డులు

Posted: 07/11/2014 10:06 AM IST
Bhuvi and shami last wicket notch up record partnership

గత సీజన్లో ఇంగ్లాండ్ గడ్డ పై అట్టర్ ప్లాప్ అయిన టీం ఇండియా ఆటగాళ్ళు ఈసారి మాత్రం అదరగొడుతున్నారు. నాటింగ్ హామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాప్ ఆర్టర్ బ్యాట్స్ మెన్స్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగా, టెయిలండర్లు అయిన భువనేశ్వర్, షమీలు ఇంగ్లీషోళ్ళను ఉతికి ఆరేసి ఆగడ్డ పై కొత్త రికార్డును సృష్టించడమే కాకుండా, భారీ స్కోరుకు బాటలు వేశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 457 పరుగుల చేసి, భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసిన టీమిండియా రెండో రోజు ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది.

తొలి రోజు స్కోరుకు మరో 24 పరుగులు జత చేసిన మురళీ విజయ్ 146 పరుగుల వద్ద అవుటయ్యాడు. అర్ధసెంచరీ చేసిన ధోనీ (82) కాసేపు ప్రతిఘటించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది.  అనంతరం వికెట్లు టపటపా రాలిపోయాలి. జడేజా (25), బిన్నీ (1), ఇషాంత్ (1) వెనుదిరిగారు. ఇక భారత్ ఇన్నింగ్స్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో టెయిలండర్లు 58 (149 బంతులు, 5 ఫోర్లు), షమీ 51* (81 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ చివర్లో హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.

తమ బ్యాటింగ్ సత్తా చాటడమే కాకుండా, తాము బాల్ తోనే కాదు, బ్యాట్ తోనూ రాణించగలమని నిరూపించారు. ఈ జోడీ చివరి వికెట్ కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ కుక్ కేవలం ఐదు పరుగులకే పెవిలియన్ చేరాడు. మొహమ్మద్ షమీ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రెండో రోజు ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. రాబ్సన్ (20), బాలెన్స్ (15) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.  వీరిద్దరు భారత్ తరఫున పదో వికెట్ కు ఇంగ్లండ్ లో అత్యధిక స్కోరు చేసిన జోడీగా రికార్డుకెక్కారు. ఉపఖండం వెలుపల ఎక్కువ బంతులు ఎదుర్కొన్న బ్యాట్స్ మెన్స్ కూడా వీరే. వీరిద్దరూ కలసి పదో వికెట్ కు 229 బంతులు ఎదుర్కొన్నారు. చివరి వికెట్ కు అత్యధిక స్కోరు చేసిన రెండో భారత బ్యాట్స్ మెన్స్. ఈ రికార్డు ఇప్పటి వరకు సచిన్-జహీర్ (133 పరుగులు) పేరు మీద ఉంది. దాన్ని వీరు తిగర రాశారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles