గ్లామర్ కావాల్సినంత వుంది... ఆట చూస్తే అదుర్స్ అంటారు... బ్యాట్ ఎత్తితే ప్రత్యర్థులు బెదిరిపోవాల్సిందే! అందంలోనూ ముద్దుగుమ్మలే! అయినా వీరికి ఒకరిపై ఇంకొకరికి అసూయ! ఒకరు వెండితెరపైన ఐటెం సాంగుల్లో నటిస్తే.. మరొకరు మీడియా ముందు పైసల కోసం కన్నీరు పెట్టుకుంది. వీరు మన దేశానికి పేరు తెచ్చిన బ్యాడ్మింటన్ బుల్లెమ్మలు జ్వాల గుత్తా, సైనా నెహ్వాల్!
ఇదిలావుండగా.. ఇదివరకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన తెలుగు క్రీడాకారులకు రివార్డులు అందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇందులో సైనా నెహ్వాల్ కు యాభై, జ్వాలగుత్తాకు పాతిక లక్షలు చొప్పున ప్రకటించారు. దీంతో దిమ్మతిరిగిపోయిన జ్వాల గుత్తా తనలో రగులుతున్న ఆవేశాన్ని సైనా నెహ్వాల్ పై చూపించింది. తామిద్దరం కలిసి భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి గౌరవం దక్కేలా చేశామని, కానీ రివార్డు విషయంలో మాత్రం తనకు తక్కువ ఇస్తున్న నేపథ్యంలో ఆమె మండిపడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటివరకు స్నేహితులుగా వున్న వీరిద్దరూ.. ఇప్పుడు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బ్యాడ్మింటన్ గేమ్ లో మంచి పేరు సంపాదించుకున్న గుత్తాజ్వాల.. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఆమె ప్రవర్తన, తీరు అస్సలు ఏమీ బాగోలేదని బహిరంగంగా ప్రకటించింది. గతంలో సైనా నెహ్వాల్ తనకు రావాల్సిన నగదు గురించి అందరికీ తెలిసేలా ట్విటర్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఇదే విషయంపై మాట్లాడిన గుత్తా... సైనా ఆ విధంగా ప్రవర్తించడం సరికాదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఒక ఇంగ్లీష్ ఛానెల్ ఇంటర్వూలో పాల్గొన్న గుత్తాజ్వాల... ఈ విధంగా సైనా నెహ్వాల్ పై విమర్శల దాడి చేసింది.
ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ... ‘‘సైనా నెహ్వాల్ ప్రవర్తించిన ఆ తీరుపై ఎలా స్పందించాలో నాకు అర్థం కావడం లేదు. సైనాకు చాలా మంచి పేరుంది. తనకు ఇవ్వాల్సిన నగదుపై ఇలా ట్విటర్ లో పోస్ట్ చేసి బహిరంగంగా చెప్పుకోవడం కంటే నేరుగా మంత్రులతో కలిసి మాట్లాడివుంటే చాలా బాగుండేది. ఓ స్పోర్ట్స్ పర్సన్ అయి కూడా ఈ విధంగా వ్యవహరించడం తనకే కాదు.. ఇతర క్రీడాకారులకు కూడా అవమానకరమైన విషయం’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. డబ్బుల వ్యవహారంలో సైనా నెహ్వాల్ తీరు చాలా భిన్నంగా వుందని ఆమె స్పష్టం చేసింది.
2012 లండన్ ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనాకు అప్పటి ఆంధ్ర ప్రభత్వం రూ.50 లక్షల నజరానా ఇస్తున్నట్టుగా ప్రకటించింది కానీ.. ఇంతవరకు ఇవ్వలేదు. దాంతో ఆగ్రహం చెందిన సైనా.. తనకు నజరానా ఇప్పించాల్సిందిగా కోరుతూ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అయితే ఆమెకు అందాల్సిన నజరానాను ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది. అలాగే కామన్వెల్త్ పోటీల్లో నెగ్గిన క్రీడాకారులకు నజరానా ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.25 లక్షలు, కాంస్యానికి రూ.15 లక్షలు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రస్తుతం గుత్తాజ్వాల కామన్వెల్త్ లో రజతం సాధించిన నేపథ్యంలో ఆమెకు రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more