Athlet milka singh thanks to central government for presenting bharat ratna award to hockey player dhyan chand

athlet milka singh, milka singh news, hockey player dhyan chand, bharat ratna awards, central government, pm narendra modi, milka singh comments dhyan chand, dhyan chand bharat ratna

Athlet Milka singh thanks to central government for presenting bharat ratna award to hockey player Dhyan chand

ఇప్పుడైనా గుర్తించినందుకు సంతోషం! మిల్కా

Posted: 08/13/2014 12:54 PM IST
Athlet milka singh thanks to central government for presenting bharat ratna award to hockey player dhyan chand

భారత కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును ప్రదానం చేసే పనిలో కొంతమంది ముఖ్యుల పేర్లను ప్రకటించింది. అందులో ప్రధానంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నతుల పేర్లను ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో హాకీ మాంత్రికుడు దివంగ ధ్యాన్ చంద్ పేరును చేర్చనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో క్రీడావిభాగంలో వున్నవారందరూ తమతమ అభిప్రాయాలను, హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్లేయర్ కు భారతరత్న అవార్డు దక్కాల్సిందేనని అందరూ వెల్లడించారు.

ఇందులో భాగంగానే భారత అథ్లెటిక్ దిగ్గజం అయిన మిల్కాసింగ్.. ఈ విషయం మీద స్పందించాడు. మేజర్ ధ్యాన్ చంద్ పేరును భారతరత్నకు ప్రతిపాదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతరత్నను అందుకున్న తొలి క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ పేరు ఖచ్చితంగా వుండాల్సిందేననీ.. కనీసం ఇన్నాళ్లతర్వాత ఆయన సేవలను గుర్తించినందుకు చాలా సంతోషంగా వుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. హోంమంత్రిత్వశాఖ ధ్యాన్ చంద్ ను భారతరత్నకు సిఫార్లు చేసిందన్న వార్త వినగానే నాకెంతో సంతోషమేసింది. బారతదేశ చరిత్రలో వున్న గొప్ప ఆటగాళ్లలో ఆయనొకరు. దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన మొదటి ఆటగాడు ఆయనే. భారతరత్న అవార్డు పొందిన తొలి ఆటగాడుగా ధ్యాన్ చంద్ కావాల్సిందే!’’ అంటూ మిల్కా ఆనందంగా అన్నారు.

నిజంగా చెప్పుకోవాలంటే... ధ్యాన్ చంద్ ఈ భారతరత్న పురస్కారానికి ఎంతో అర్హుడు. భారత్ కు స్వాతంత్ర్యం రావడానికి ముందే మన దేశ ఘనతను అంతర్జాతీయ స్థాయిలో చాటిన ఘనుడు ఈయన. వరుసంగా జరిగిన ఒలంపిక్స్ లో 1928, 1932, 1936... ఇలా వరుసగా మూడు పర్యాయాలూ స్వర్ణ పతకాలను సాధించి భారత్ ను విశ్వవిజేతగా నిలిపారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆయన ప్రాతినిధ్యం వహించిన కాలం (1926 - 1948)లో ప్రపంచ హాకీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇంతటి గొప్ప వ్యక్తికి ఒక్క భారతరత్న ఏంటి... అటువంటివి పదిచ్చిన తక్కువే అవుతాయనన్నది అందరి అభిప్రాయం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles