Power lifter suryavamshi hemaltha concerns infront kcr press meet

power lifter suryavamshi hemalatha, suryavamshi hemalatha latest news, kcr latest press meet, kcr latest news, indian power lifters, telugu latest news, telugu latest sports news, sports news telugu, telugu sports news, suryavamshi hemalatha news

power lifter suryavamshi hemaltha concerns infront kcr press meet

అన్యాయం చేశారంటూ కేసీఆర్ ముందు క్రీడాకారిణి!

Posted: 09/12/2014 12:21 PM IST
Power lifter suryavamshi hemaltha concerns infront kcr press meet

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం కొన్ని విభాగాలకు ప్రత్యేకంగా నజరానాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే! అందులో ముఖ్యంగా ఆయన క్రీడారంగానికి పెద్ద పీటే వేశారు. ఇప్పటివరకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు గెల్చుకున్నవారికి కేసీఆర్ 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బహుమతులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయా విభాగాలకు చెందిన క్రీడాకారులు తమతమ నజరానాలను పొందారు. అయితే గతంలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరికొందరు క్రీడాకారులకు మాత్రం ఈ పతకాలుగానీ.. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు కానీ అందలేదు. దీంతో వారిప్పుడు సీఎం కేసీఆర్ ముందు మొరపెట్టుకున్నారు.

ఇందులోభాగంగానే.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పవర్ లిఫ్టర్ సూర్యవంశి హేమలత గురువారంనాడు కేసీఆర్ ను కలిశారు. ఆమె 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాధించింది. అయినప్పటికీ ఆమెను తర్వాత జరిగిన అంతర్జాతీయ క్రీడలకు అప్పటి ప్రభుత్వం ఎంపిక చేయలేదు. అంతేకాదు.. గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ ఆమెకు నజరానా, గుర్తింపు అస్సలు లభించలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలు కూడా అందలేదు. కేవలం జాతీయ స్థాయిలోనే కొనసాగుతూ వచ్చిన ఆమె.. ఆ తర్వాత కనుమరుగైపోయింది. ఇప్పుడు తాజాగా తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె కేసీఆర్ ముందుకు వచ్చారు.

తాను స్వర్ణపతకం గెలిచినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు అనుమతించలేదని కేసీఆర్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది హేమలత! తన జీవితాన్ని క్రీడల శిక్షణకే దారపోశానని.. కానీ ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నానని ఆమె కేసీఆర్ ముందు కన్నీటిపర్యంతమయ్యారు. క్రీడావిభాగంలో మంచి పేరు సాధించినప్పటికీ తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నారు. దీంతో ఆమెను అన్నివిధాలుగా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. అలాగే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉద్యోగం కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power lifter suryavamshi hemalatha  kcr  asian games  sports news  telangana government  

Other Articles