భారత స్టార్ డబుల్స్ షట్లర్స్’గా పేరుగాంచిన గుత్తాజ్వాల, అశ్విని పొన్నప్పలు ‘‘బాయ్’’ మీద బాగానే ఫైర్ అయ్యారు. బాయ్’పై నమ్మకం కోల్పోయామని చెబుతున్న ఈ జంట.. ఇకమీదట ఆ బాయ్’పై ఆధారపడదలుచుకోలేదని కరాఖండీగా వెల్లడిస్తున్నారు. గతకొన్నాళ్ల నుంచి ఆ బాయ్’పై తమ మనసులో దాచుకున్న పూర్తి అక్కసును ఈ జంట ఒక్కసారిగా బయటపెట్టేసింది. ఇంతకీ ఆ ‘బాయ్’ ఎవరు అని ఆలోచిస్తున్నారా..? బాయ్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI).
‘బాయ్’ మునుపటిలా కాకుండా ఈసారి డబుల్స్’పై వివక్ష చూపుతోందంటూ ఆ ఇద్దరు క్రీడాకారిణులు మండిపడుతున్నారు. ఒలంపిక్స్’కి సమయం దగ్గరపడుతున్నా.. ఇంతవరకు డబుల్స్’కు స్పెషలిస్ట్ కోచ్’ను నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కోచ్’ని నియమిస్తారనే నమ్మకంతో ఇన్నాళ్లవరకు వున్నామని.. కానీ బాయ్ ప్రదర్శించిన నిర్లక్ష్యం పట్ల ఆ సంస్థపై పూర్తిగా నమ్మకం కోల్పోయామని.. ఇకనుంచి శిక్షణకోసం అన్ని సదుపాయాలున్న ఓ ఆసియా దేశానికి వెళ్లనున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచ ఛాంపియన్’షిప్’లో కాంస్య పతకం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన ఈ జోడీ.. గతకొన్నాళ్ల నుంచి జరుగుతున్న టోర్నీల్లో మాత్రం అంతగా ప్రతిభ కనబరచలేకపోయింది. వరుసగా పరాజయాల పాలవుతూనే వుంది. సరైన కోచ్’ను నిర్వహించకపోవడంతోనే ఈ జోడీ ఓడిపోయారంటూ ఆరోపణలు వచ్చిన సందర్భాలూ వున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రీడలు సమీపిస్తున్న కోచ్’ను నియమించకపోవడంతో ఈ జంటతోబాటు మరికొందరు మండిపడ్డారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more