Supreme court asks bcci immediate action against gurnath meiyappan

supreme court on gurnath meiyappan, supreme court on chennai super kings, gurnath meiyappan in fixing case, supreme court on srinivasan, supreme court on bcci, supreme court ipl spot fixing comments, gurnath meiyappan in fixing, ipl spot fixing mudgal committee, ipl fixing latest updates

supreme court asks bcci immediate action against gurnath meiyappan : supreme court orders bcci on monday to take necessary immediate action against gurnath meiyappan in fixing case

క్రికెట్ ఫిక్సింగ్ కోరలు విరిచేస్తున్న కోర్టు

Posted: 12/09/2014 03:43 PM IST
Supreme court asks bcci immediate action against gurnath meiyappan

భారత క్రికెట్ జట్టును పట్టి పీడిస్తున్న ఫిక్సింగ్ కోరలను సుప్రీంకోర్టు విరిచేస్తోంది. ఫిక్సింగ్ ను తీవ్రంగా పరిగణిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం కేసుపై విచారణ జరుపుతున్న ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలుచేస్తోంది. తాజాగా జరిగిన విచారణ సందర్బంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన గుర్నాథ్ మీయప్పన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలుతీసుకోవాలని బోర్డుకు నాలుగు ఆప్షన్లు  ఇచ్చింది.

* శ్రీనివాసన్ ను పక్కనబెట్టి, మీయప్పన్ పై బీసీసీఐ కమిటి నిర్ణయం తీసుకోవాలి.
* గుర్నాథ్ పై శిక్షను పరిశీలించేందుకు ఇద్దరు  స్వతంత్ర్య న్యాయమూర్తులను నియమించటం.
* శిక్ష విధింపును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లు నిర్ణయిస్తాయి.
* ముద్గల్ కమిటి మీయప్పన్ కు విధించాల్సిన శిక్షను సూచిస్తుంది.

 ఈ నాలుగింటిలో ఒక దాన్ని ఎంచుకుని శిక్షను విధించాలని క్రికెట్ బోర్డుకు సూచించింది. బీసీసీఐని కాదని మీయప్పన్ పై చర్యలు తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టే బోర్డుకు అవకాశం ఇస్తున్నామనీ.., గరిష్ట శిక్షను విధించాలని ఆదేశించింది. అటు బీసీసీఐ బోర్డు చైర్మన్ గా లేకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సమావేశంకు శ్రీనివాసన్ హాజరుకావటాన్ని కూడా సుప్రీం తప్పుబట్టింది. గతంలో బీసీసీఐచైర్మన్ గా  ఉన్న శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ అధినేతగా ఉన్నారని. ఈ సంస్థకు ఐపీఎల్ లో ఫ్రాంచైజీ వాటా ఉన్నందున వాసన్ వ్యవహారాన్ని అనుమానించక తప్పదు అని స్పష్టం చేసింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court on bcci  gurnath meiyappan fixing  srinivasan latest updates  

Other Articles