Aiba banned boxer sarita devi one year

boxer sarita devi banned, boxer sarita devi banned one year, aiba bans boxer sarita devi, boxer sarita devi justice, boxer sarita devi vs aiba, boxer sarita devi latest updates, indian athletics asian medals 2014 list, indian boxers team updates, sarita devi in asian games, sachin on boxer sarita devi, sports latest news updates

AIBA banned Boxer Sarita Devi one year : The International Boxing Association (AIBA) on Wednesday banned Indian boxer Sarita Devi for one year for refusing to accept the Asian Games bronze medal.

ఏమనుకోవాలి ఉపశమనమా, లేక శిక్షనా..?

Posted: 12/17/2014 03:14 PM IST
Aiba banned boxer sarita devi one year

అన్యాయంను ప్రశ్నించిన భారత వనితను అంతర్జాతీయ సమాఖ్య అవమానించింది. పతకాల కంటే ఆత్మగౌరవం ముఖ్యం అనుకున్నందుకు శిక్షను బహుమతిగా ప్రకటించింది. ఎదురుతిరిగి అవమానించింది అనే అక్కసుతో బాక్సర్ సరితాదేవిని ఏడాదిపాటు నిషేధిస్తూ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐఏబీఎ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్ లో జరగిన అన్యాయంను ప్రశ్నించి మెడల్ ను తిరస్కరించిన సరితపై ఆగ్రహించిన అంతర్జాతీయ బోర్డు ఈ ఘటనపై విచారణ జరిపింది. సరితకు అన్యాయం జరిగినా., ఆమె తప్పు చేసిందని నివేదిక రావటంతో శిక్ష విధించింది.

బోర్డు ఆగ్రహం నేపథ్యంలో ముందుగా కఠిన శిక్ష విధిస్తారని అనుమానం, ఆందోళన వ్యక్తం అయింది. అయితే పలువురు ప్రముఖుల మద్దతు భారత బాక్సింగ్ అసోసియేషన్ జోక్యంతో తగ్గిన అంతర్జాతీయ బోర్డు ఏడాదిపాటు నిషేధిస్తూ కసి తీర్చుకుంది. క్రమశిక్షణా చర్యల ప్రకారం ఏడాది పాటు సరితను ఆడనివ్వబోమని అంతర్జాతీయ బోర్డు ప్రకటించింది. ఈమెతో పాటు భారత్ కు కోచ్ గా వ్యవహరిస్తున్న బి.ఐ.ఫెర్నాండెజ్ పై రెండేళ్ళ నిషేధం విధించింది. అయితే జీఎస్ సంధుకు క్లీన్ చిట్ ఇచ్చింది.

2014 ఆసియా గేమ్స్ లో భారత్ తరపున ఆడిన సరతాదేవికి... రిఫరీలు అన్యాయం చేయటంతో ఓడిపోయింది. ఈ విషయాన్ని ప్రత్యర్థి బాక్సర్ కూడా అంగీకరించింది. తనకు జరిగిన అన్యాయంకు నిరసనగా మెడల్ స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా చర్యలు తీసుకుంది. ఈ తీర్పు పట్ల సరిత అభిమానులు, సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఇది ఆమెకు లభించిన ఉపశమనంగా భావించాలని చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boxer sarita devi banned  AIBA latest updates  asian games medals for india  

Other Articles