పాకశాలలో ప్రావీణ్యం పొందేందుకో లేదా టైంపాస్ కో కానీ వింబుల్డన్ క్రీడాకారుడు నాదల్ గరిట పట్టారు. క్రికెట్ గాడ్ ఫాదర్ సచిన్ టెండూల్కర్ తీరిక సమయాల్లో గరిట తిప్పి తన వంటల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారన్న వార్తలు గతంలో చదివాం. అయితే తాజాగా అలా తీరిక సమయంలో వంటులు చేస్తు.. నలభీముడి అవతారాన్ని ఎత్తిన వారి జాబితాలోకి నాదల్ కూడా చేరారు. వింబుల్డన్ టోర్నమెంట్‌తో టెన్నిస్ స్టార్ట్స్ అంతా బిజీబిజీగా గడుపుతుంటే స్పెయిన్ టెన్నిస్ స్టార్ నాదల్ మాత్రం తీరిగ్గా వంట మొదలు పెట్టాడు.
టెన్నిస్ కోర్టులో బ్యాటు తప్పడం కన్నా.. వంటగదిలో అందులోనూ చిన్నపాటి ప్యాన్ లో గరిట తిప్పడమూ రెండూ ఒకటేనంటున్నాడు. కోర్టులో బ్యాట్ తిప్పి పాయింట్లు సాధించి ప్రత్యర్థులపై విజయాన్ని నమోదు చేయడం ఎంత ముఖ్యమో.. వంటగదిలో ప్యాణ్ పై గరిట తప్పి.. మంచి రుచికరమైన ఆహారాన్ని వండి వార్చడం కూడా అంతే ముఖ్యమంటున్నాడు. కాగా, కోర్టులో పాయింట్లను బట్టి గెలుపోటములు లెక్క తెలుస్తుందని, కానీ వంటగదిలో మాత్రం వంట పూర్తైన తరువాత.. దానిని తిన్నవారు బాగుందని చెబితే కానీ విజయాన్ని అందుకోలేమంటున్నాడు రఫెల్ నాదల్ .
అయితే గరిట తిప్పడంలో ప్రావిణ్యం సంపాదించాలని అనుకుంటున్నారా అంటే మాత్రం ముసిముసి నవ్వులు చిందిస్తూ సమాధానం దాటవేస్తున్నాడు ఈ యువ ఆటగాడు. సోమవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో బ్రెజిల్ క్రీడాకారుడు థామస్ బెల్లూసీతో అలవోకగా విజయం సాధించిన నాదల్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బ్రెజిల్ క్రీడాకారుడు డుస్టిల్‌బ్రౌన్‌తో తలపడనున్నాడు.ఈ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండడంతో నాదల్ గరిటతో వంట గదిలో సాధన చేస్తున్నాడు. మొత్తానికి భోజనం అతిప్రియం అన్నట్లు నాదల్ గరిట తిప్పడం వార్తల్లోకెక్కారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more