Vikas Gowda finishes 9th, Indian athletes disappoint at World Championships

Vikas gowda finishes ninth at athletics worlds

Vikas Gowda, World Athletics Championships, discus throw, athletes, Indian athletes, World Championships 2015, IAAF World Cross Country Championships,Athletics, sudha shingh,jaisha, national record, marathon

Indian athletes continued their disappointing performance in the World Championships as country's best hope Vikas Gowda finished a poor ninth in the final round of the men's discus throw event.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో భారత్ కు నిరాశ

Posted: 08/30/2015 09:28 PM IST
Vikas gowda finishes ninth at athletics worlds

బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. ఈ ఛాంపియన్ షిప్ లలో భారత్ ఆటగాళ్ల పతకాల వేట ముగిసింది. అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున పలు క్యాటగిరీలలో బరిలోకి దిగిన భారత ఆటగాల్లు మెరుగైన ప్రతిభను కనబర్చి పతకాలను సాధించడంలో విఫలమయ్యారు. దీంతో ఎలాంటి పతకాలను ఖాతాలో వేసుకోకుండానే భారత్ ఆటగాళ్లు వెనుదిరగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైయ్యింది.

పతకం మీద ఆశలు రేపిన వికాస్ గౌడ నిరశపరచగా.. ఆదివారం మారథాన్ లో భారత అథ్లెట్లు నేషనల్ రికార్డుతో సరిపెట్టుకున్నారు. ఓపీ జైషా 2:34:43 టైమింగ్ తో నేషనల్ రికార్డు నెలకొల్పింది. మరో రన్నర్ సుధాసింగ్ 2:35:35తో వ్యక్తిగత రికార్డు మెరుగుపరుచుకుంది. దీంతో భారత్ పతకాల జాబితాలో చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే ఇధియోపియా నుంచి మారే డిబాబా మారథాన్ స్వర్ణం గెలుచుకోగా.. కెన్యా  రన్నర్ హెలత్ రెండో స్థానంలో నిలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikas Gowda  World Athletics Championships  discus throw  Indian athletes  jaisha  

Other Articles