ప్రపంచాన్ని ఊపుఊపేసిన యోగా మీద భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యోగాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిన భారత ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసి యోగాను స్పోర్ట్ కింద (క్రీడగా) గుర్తింపునిచ్చింది. వచ్చే ఏడాది గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో కూడా యోగాకు చోటు కల్పించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా మానవుడి పరిపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తున్న యోగాను తాజాగా క్రీడగా గుర్తిస్తు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వచ్చే ఆసియా క్రీడల జాబితాలో కూడా యోగాను చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యోగాకు ప్రయారిటీ విభాగంలో చోటిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో యోగాను ఇతర క్రీడల విభాగం నుంచి జనరల్ కు మార్చారు. అంతేకాకుండా ప్రయారిటీ కేటగిరీలో ఫెన్సిం గ్‌కు యూనివర్సల్ స్పోర్ట్స్ కింద చోటిచ్చారు. మొత్తానికి యోగాకు మరింత ప్రోత్సాహాన్నిస్తు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more