2015 Denmark Open Superseries Premier: PV Sindhu through to the quarters

Pv sindhu in danish open quarters to meet yihan wang next

Denmark Open - Badminton,P V Sindhu,Tzu Ying TAI,Badminton, Denmark open,Denmark Open live,Saina Nehwal vs Busanan Ongbumrungphan, Denmark Open Super Series Premier, Sain Nehwal, PV Sindhu, Kidambi Srikanth, Ajay Jayaram, PV Sindhu vs Maria Febe Kusumastuti,Saina Nehwal,PV Sindhu,Follow live updates for PV Sindhu, badminton saina nehwal, saina nehwal badminton, badminton news, badminton, Odense

India’s P V Sindhu made it to through to the quarterfinals of the Denmark Open Superseries Premier after beat Tzu Ying Tai of Chinese Taipei 21-12 21-15 in he second round

డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సింధూ, ఓడిన సైనా

Posted: 10/16/2015 04:31 PM IST
Pv sindhu in danish open quarters to meet yihan wang next

డెన్ మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో తెలుగుతేజం పివీ సింధూ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. తొలిరౌండ్ లో ఇండోనేషియాకు చెందిన మారియా ఫెడీ కుసుమస్తుతితో తలపడి విజయాన్ని అందుకున్న తెలుగు తేజం పి వీ సిందూ.. రెండో రౌండ్ లో చైనా క్రీడాకారిని థర్డ్ సీడ్ తై జు యింగ్ తో తలపడింది. అంచనాలు, అంతకు ముందు తలపడిన గణంకాల నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలవడం సింధూకు కష్టమని అందరూ భావిస్తున్న తరుణంలో అంచనాలను తలకిందులు చేస్తూ రాణించిన పింధూ.. నేరుగా డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లోకి దూసుకెళ్లింది.

ప్రపంచ నాలుగో ర్యాంకర్ చైనా తైపీ తైపీస్ తాయ్ జు యింగ్ తో జరిగిన మ్యాచ్ లో ఆద్యంతం సింధూ తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి ఈ మ్యాచ్ లో పైచేయి సాధించింది. చైనా క్రీడాకారిణిపై 21-12, 21-15 స్కోరుతో నెగ్గి సింధూ క్వార్టర్స్ లోకి వెళ్లింది. గత జూలైలో జరిగిన తైపీ ఓపెన్ లో తై జు చేతిలో తాను పరాజయం పోందానని, కానీ ఈ మ్యాచ్ లో అమె ట్రాప్ లోకి తాను రాలేదని, అమెను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తాను అమెకు ఎలాంటి అవకాశాలను మిగల్చకుండా కోర్టులో పూర్తిగా తచ్చాడుతూ మెరుగైన ఆటను ప్రధర్శించానని సింధూ చెప్పింది.

కాగా, భారత్ స్టార్ షెట్లర్, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ నిన్న రాత్రి జరిగిన డెన్మార్ ఓపెన్ రెండో రౌండ్ లో తడబడ్డారు. సైనా నెహ్వాల్ ఎదుర్కోన్న తొలి రౌండ్ లోనే చాలా కష్టపడి నెగ్గినా..  రెండో రౌండ్ లో అమె ఏ మాత్రం రాణించలేక పోయింది. తొలిరౌండ్లో ప్రత్యర్థి థాయ్ క్రీడాకారిణి బుసనన్ అన్బురుమ్ రంగ్ఫన్ తో నువ్వా- నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు గెలిచిన సైనా రెండో రౌండ్ లో మాత్రం జపాన్ కు చెందిన మినాట్సు మిటాని చేతిలో 21-18, 21-13 స్కోరుతో ఓటమిపాలయ్యింది. మిటానితో వివిధ టోర్నీలలో ఎనమిది సార్లు తలపడిన సైనా ఐదు పర్యాయాలు విజయం సాధించినా.. తొమ్మిదవ సారి జరిగిన మ్యాచ్ లో మరోమారు పరాభవం ఎదురైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Denmark Open Super Series Premier  PV Sindhu  Kidambi Srikanth  

Other Articles