PV Sindhu edges Yihan Wang 21-18, 21-19 to seal semis berth at Denmark Open

Pv sindhu enters denmark open semifinal

Denmark Open - Badminton,P V Sindhu,Tzu Ying TAI,Badminton, Denmark open,Denmark Open live,Saina Nehwal vs Busanan Ongbumrungphan, Denmark Open Super Series Premier, Sain Nehwal, PV Sindhu, Kidambi Srikanth, Ajay Jayaram, PV Sindhu vs Maria Febe Kusumastuti,Saina Nehwal,PV Sindhu,Follow live updates for PV Sindhu, badminton saina nehwal, saina nehwal badminton, badminton news, badminton, Odense

PV Sindhu take on Carolina Marin in the semis; she defeated her in Maldives at a time when they both were unknown entities in the sport.

డెన్మార్క్ ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్తిన సింధూ, ఓడిన సైనా

Posted: 10/17/2015 05:44 PM IST
Pv sindhu enters denmark open semifinal

తెలుగుతేజం పివీ సింధూ డెన్ మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో జోరు కోనసాగిస్తుంది. వరల్డ్ చాంపియన్ షిప్  పోటీలలో రెండు పర్యాయాలు కాంస్య పతకాన్ని సాధించన, హైదరాబాదీ డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. తొలిరౌండ్ లో ఇండోనేషియాకు చెందిన మారియా ఫెడీ కుసుమస్తుతితో, ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరిన సింధు.. ఇవాళ జరిగిన మ్యాచ్ లో కూడా అదే జోరును కొనసాగిస్తూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది.

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా శనివారం జరిగిన పోరులో సింధు 21-18, 21-19 తేడాతో మాజీ నంబర్ వన్ వాంగ్ యిహాన్ (చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ కు చేరింది. సుమారుగా 45 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సెమీ ఫైనల్లో సింధు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ తో ఆడనుంది. ఇద్దరి రికార్డులను పరిశీలిస్తే మారిన్ దే పై చేయిగా ఉంది. అంతకుముందు ఇరువురి మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ ల్లో మారిన్ విజయం సాధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Denmark Open Super Series Premier  PV Sindhu  Carolina Marin  

Other Articles