వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ లో తీవ్రంగా శ్రమించినా కొద్దిలో స్వర్ణం చేజారడం నిరాశ కలిగించిందని యువ బ్యాడ్మింటన్ ఆటగాడు ఏఎస్ఎస్ సిరిల్ వర్మ అన్నాడు. పెరూలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో sl తన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన సిరిల్.. రజతంతో సంతృప్తి చెందాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న తర్వాత టైటిల్ దక్కుతుందని నమ్మకంతో ఉన్నానని. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి తనకంటే ఎంతో మెరుగ్గా ఆడి ఆధిపత్యం ప్రదర్శించాడని చెప్పుకోచ్చాడు.
అయితే భారత్ తరఫున తొలి సారి రజతం గెలుచుకున్న ఆటగాడిగా నిలవడం సంతోషకరంగా వుందన్నాడు. ఈ పతకాన్ని తన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అంకితమిస్తున్నానని సిరిల్ పేర్కొన్నాడు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సిరిల్‌కు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ సిరిల్‌కు ప్రోత్సాహకంగా 2 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. కార్యక్రమంలో సిరిల్ తల్లిదండ్రులు రామరాజు, సుశీలతో పాటు వర్ధమాన షట్లర్లు పాల్గొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more