టీమిండియా పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌కు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారంతో సత్కరించింది. గత ఏడాదికి సంబంధించిన ‘లెఫ్టినెంట్ కల్నల్ జీవీ రాజా అవార్డు’ను పీఆర్ శ్రీజేష్ కు అందించిన కేరళ క్రీడా మండలి ఆయన సాదరంగా సత్కరించింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా శ్రీజేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డు కింద శ్రీజేష్‌కు రూ. 3 లక్షల నగదు అందజేశారు.
త్రివేండ్రంలోని మస్కట్ హోటల్ లో కేరళ క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి తిరువాంచుర్ రాధాకృష్ణన్ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డుకు శ్రీజేష్ కు అందజేశారు. శ్రీజేష్ త్వరలో అస్ట్రేలియాతో జరిగనున్న మూడు రోజుల హాకీ టెస్టు సిరీస్ లో పాల్గోననున్నాడు. ఈ నెలాఖరులో చత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో జరగనున్న హారో హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ లో కూడా పాల్గోననున్నాడు. తనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం పట్లు గర్వంగానూ, ఆనందంగానే వుందని శ్రీజేష్ పేర్కోన్నాడు. తనను ఈ అత్యున్నత రాష్ట్ర పురస్కారానికి ఎంపిక చేసిన కేరళ క్రీడా మంత్రిత్వశాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు అందించిన ఉత్సహాంతో తాను భవిష్యత్తులో మరింతగా రాణించగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more