సౌత్ ఏషియన్ గేమ్స్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి దాకా జరిగిన అన్ని ఈవెంట్లలో మన వాళ్లు పథకాలు సాధించి. కొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 11 11 స్వర్ణాలతో అదరగొట్టారు. మహిళల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమన్ దేవి అత్యుత్తమ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సుమన్ దేవి ఈటెను 59.45 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన అన్నూ రాణి 57.13 మీటర్ల దూరంతో రెండోస్థానంలో నిలిచింది. ఇక పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఆసియా క్రీడల మాజీ చాంపియన్ రంజిత్ మహేశ్వరి 16.45 మీటర్ల దూరం లంఘించి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. రంజిత్ సహచరుడు జయకుమార్ రజతం నెగ్గాడు. మిగతా భారత అథ్లెట్లలో పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాశ్ కర్హానా, మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర, పురుషుల్లో అజయ్‌కుమార్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జువానా ముర్ము, పురుషుల విభాగంలో ధరుణ్ అయ్యాస్వామి, మహిళల 10,000 మీటర్ల రేసులో ఎల్ సూర్య, 200 మీటర్లలో శ్రావణి నందాలు స్వర్ణాలు సాధించినవారిలో ఉన్నారు.
షూటింగ్లో జరిగిన ఐదు ఈవెంట్లలోనూ స్వర్ణాలు మనోళ్లనే వరించాయి. అయితే ఫేవరెట్‌గా పోటీపడ్డ ఒలింపిక్ పతక విజేత, స్టార్ షూటర్ గగన్ నారంగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గడంలో విఫలమయ్యాడు. ఫైనల్స్‌లో నారంగ్‌ను రజతానికే సరిపెడుతూ భారత షూటర్ చైన్ సింగ్ స్వర్ణం నెగ్గాడు. ఇక ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో నారంగ్, చైన్‌సింగ్, సురేందర్‌లతో కూడిన భారత త్రయం స్వర్ణం అందుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో సమరేశ్ జంగ్ పసిడి పతకం అందుకోగా, భారత్‌కే చెందిన పెంబా తమాంగ్, విజయ్‌కుమార్‌లకు రజత, కాంస్యాలు దక్కాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మూడు పతకాలూ భారత షూటర్లకే దక్కాయి. కుహేలీ గంగూలీకి స్వర్ణం, లజ్జా గోస్వామికి రజతం, అనూజా జంగ్కు కాంస్యం లభించాయి. ఇక ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో గంగూలీ, గోస్వామి, అనూజ బృందం స్వర్ణం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more