Dipa Karmakar scripts history, becomes first Indian gymnast ever to qualify for Olympics

Dipa karmakar becomes first indian gymnast to qualify for olympics

Dipa Karmakar, Rio Games, Rio 2016, Rio Olympics, Gymnastics news, Rio Olympics, First Indian gymnast to qualify, Rio de Janiero, Olympics, Indian gymnast, Commonwealth games

This win made her the first Indian woman to win a commonwealth gymnastics medal and the second Indian, after Ashish Kumar.

రియోకు అర్హతతో చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్

Posted: 04/18/2016 10:04 AM IST
Dipa karmakar becomes first indian gymnast to qualify for olympics

భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా అర్హత సంపాదించింది. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగబోతున్న రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆమె అర్హత పొందింది. ఇంతవరకు ఒలింపిక్స్ లో జరిగిన జిమ్నాస్ట్ పోటీలలో భారత్ తరుపు మహిళలు అర్హత సాధించలేదు. దాంతో దీపా కొత్త చరిత్రను సృష్టించినట్టయింది. ఒలంపిక్స్ అర్హత కోసం నిర్వహించిన పరీక్షలలో మొత్తంగా 52 వేల 698 పాయింట్లతో అమె రియోలోకి అడుగుపెట్టింది.

అంతకుముందు నవంబర్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిఫ్ లలో అమె ఒలంపిక్స్ అర్హత సాధించలేకపోయింది, అమె ఐదవ స్థానానికే పరిమితం కావడంతో అమె తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇక ఈ సారి కూడా ఒలంపిక్స్ సెకెండ్ రిజర్వులో నిలవడంతో.. రియోకు వెళ్లే ఆశలపై నీళ్లు వదిలేసిన దీపకు నిర్వాహకుల నుంచి తీపికబురు వచ్చింది. దీప పేరును రియో ఒలంపిక్స్ లో షార్ట్ లిస్ట్ చేశామని, దీంతో పరీక్షలలో పాల్గోనే అవకాశం లభించింది, దీంతో అమె తన సత్తాను చాటుకుని ఒలంపిక్స్ లో స్థానం సంపాదించి రికార్డు సృష్టించింది.

త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీపా.. ఆంతకుముందు కూడా సంచలన విజయాలు అందుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ అందుకుంది. కామన్వెల్త్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో మెడల్ కొట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దీపానే. అలాగే గతేడాది నవంబర్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిఫ్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారత మహిళ కూడా దీపానే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dipa Karmakar  first Indian woman  gymnast  Rio Olympics  

Other Articles