Indian Hockey Team Thrashes Malaysia 6-1, Enters Final Of Sultan Azlan Shah Cup After 8 Years!

India crush malaysia 6 1 to face australia in sultan azlan shah hockey final

India vs Malaysia,India Hockey,Sultan Azlan Shah Hockey,India vs Australia Azlan Shah Hockey,Ramandeep Singh,Nikkin Thimmaiah, malaysia hockey, azlan shah cup hockey, indian hockey team, indian hockey, hockey news, hockey india

Indian hockey team made the nation proud once again by cruising into the final of the Sultan Azlan Shah Cup.

అజ్లాన్ షా కప్ టోర్నీలో టైటిల్ ఫైట్ దిశగా భారత్

Posted: 04/16/2016 02:39 PM IST
India crush malaysia 6 1 to face australia in sultan azlan shah hockey final

చావోరేవో మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టిన భారత.. అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఏడోసారి టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది.  దాదాపుగా ఎనమిది సంవత్సరాల తరువాత మళ్లీ ఫైనల్ కు చేరిన భారత జట్టు టైటిల్ పోరు సమరంలో ప్రత్యర్థితో తలపడనుంది. క్రితం రోజు జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత 6-1తో ఆతిథ్య మలేసియాను చిత్తు చేసింది. ఫైనల్‌ చేరాలంటే సర్దార్‌సేన ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే, ఐదు సార్లు విజేత అయిన భారత.. ఆతిథ్య జట్టుపై ఏకపక్ష విజయం సాధించి మొత్తం 12 పాయింట్లతో డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ (11)ను వెనక్కి నెట్టి ఫైనల్‌ బెర్తు దక్కించుకుంది. ఇవాళ జరిగే తుదిపోరులో ప్రపంచ చాంపియన్‌ ఆసే్ట్రలియాతో భారత తలపడనుంది. రమణ్‌దీప్‌ సింగ్‌ (25, 39 నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తాచాటాడు. ఎస్‌వీ సునీల్‌ (2వ నిమిషం), హర్జీత సింగ్‌ (7వ నిమిషం), డానిష్‌ ముజ్తాబ (27వ నిమిషం), తల్వీందర్‌ సింగ్‌ (50 నిమిషం) తలో గోల్‌తో రాణించారు.

మలేసియా తరపున షహ్రిల్‌ సాబా (46వ) ఏకైక గోల్‌ సాధించాడు. కాగా, మరో మ్యాచ్‌లో ఆసీస్‌ 3-0తో కెనడాపై నెగ్గింది. దీంతో లీగ్‌ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆసీస్‌ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. గతేడాది మాత్రం న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. భారత కాంస్య పతకం నెగ్గింది. కాగా, టీమిండియా చివరగా 2010లో ఫైనల్‌ ఆడింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దవడంతో దక్షిణ కొరియాతో టైటిల్‌ పంచుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles