Messi statue unveiled in Argentina amid pleas for his return

Argentina ups ante on lionel messi persuasion with statue dedication

2014 World Cup, Barcelona, Chile, Copa America Final, Diego Maradona, KickingAround, Lionel Messi, Mauricio Macri, Soccer star, Football, Argentina, messi statue, Football news, soccer news, World Cup 2018

Two days after Lionel Messi said he would never play for Argentina again, a statue of him was unveiled at Buenos Aires,Argentina.

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ..

Posted: 06/30/2016 05:51 PM IST
Argentina ups ante on lionel messi persuasion with statue dedication

కోపా అమెరికా ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో చిలీతో ఓటమి అనంతరం 'దేశం తరపున నా చివరి మ్యాచ్ ఆడేశాను' అంటూ మెస్సీ చేసిన ప్రకటనను అర్జెంటీనా ఫుట్బాల్ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యూనస్ ఎయిర్స్ నగర మేయర్ మెస్సీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 29 ఏళ్ల మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.

అర్జెంటీనా ప్రెసిడెంట్ మారిసియో మాక్రితో పాటు ఫుట్బాల్ దిగ్గజం మారడోనా సైతం మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒలంపిక్స్లో అర్జెంటీనాకు గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మెస్సీ.. మూడు ప్రతిష్టాత్మక ఫైనల్స్( 2015, 2016 కోపా అమెరికా, ప్రపంచకప్ 2014)లో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. రష్యాలో 2018లో జరగనున్న వరల్డ్ కప్లో మెస్సీ ఆడాలని అర్జెంటీనాతో పాటు ప్రపంచ ఫుట్బాల్ ప్రేమికులు కోరుకుంటున్నారు. దీంతో 'ఫోర్త్ టైం లక్కీ' నినాదంతో మెస్సీని వెనక్కిరావాలని కోరుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lionel Messi  Mauricio Macri  Soccer star  Football  Argentina  messi statue  

Other Articles